Man Marries Two Women At A Time: ఒకేసారి ఇద్దరు స్నేహితులను పెళ్లి చేసుకున్న వసీం షేక్.. ముగ్గురి సంచలన వివాహం వైరల్!

Man Marries Two Women At A Time: నేటి కాలంలో సరైన సమయంలో పెళ్లిళ్లు జరగక చాలామంది యువకులు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. కొందరు కులం, సంప్రదాయాల అడ్డంకులను అధిగమించి వివాహం చేసుకుంటూ సంసార జీవితాన్ని సాగిస్తున్నారు. మరికొందరు మాత్రం ఒంటరిగానే జీవితం గడుపుతున్నారు. ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా దాదాపుగా ఒకే విధంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం లేదా వారి అభిరుచులు, అంచనాలు పెరిగిపోవడం వల్ల అనేక మంది యువకుల వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. అయితే ఈ కథలోని యువకుడి పరిణామం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.

Man Marries Two Women At A Time
Man Marries Two Women At A Time

వసీం షేక్ జీవితం - ఒక విశేష మలుపు: బెంగళూరుకు చెందిన వసీం షేక్, మంచి విద్యావంతుడు. అక్కడే ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అందంగా ఉండటమే అతడికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇదే అతడి జీవితానికి కీలక మలుపు తిప్పింది. అతడి అందానికి ముగ్ధులైన షిఫా షేక్, జన్నత్ అనే ఇద్దరు యువతులు వసీంపై ప్రేమను పెంచుకున్నారు. 


ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్‌గా మారి అభిప్రాయాలు, భావోద్వేగాలను పంచుకున్నారు. వారందరి అనుబంధం అంతగా పెరగడంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. చివరికి ముగ్గురూ కలిసి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఒకే వేదికపై ముగ్గురి కల్యాణం: వారి సంప్రదాయం ప్రకారం ఒకే వేదికపై వసీం, షిఫా, జన్నత్‌ల వివాహం జరగడం బెంగళూరులోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తోంది. నేటి కాలంలో పెళ్లిళ్లు జరగడమే కష్టంగా ఉన్నప్పుడు వసీం ఏకంగా ఇద్దరు యువతులను వివాహం చేసుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది. పైగా, పరస్పర అంగీకారంతో ఈ వివాహం జరగడం మరింత ఆశ్చర్యకరంగా నిలిచింది.

నెటిజన్ల ప్రతిస్పందన: ఈ ముగ్గురి వివాహాన్ని చూసి బంధువులు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలోనూ దీనిపై విస్తృత చర్చ నడుస్తోంది. కొందరు ఈ ఘటనను విజయ్ సేతుపతి, సమంత, నయనతారల కాంబినేషన్‌లో వచ్చిన కన్మణి, రాంబో, ఖతిజా సినిమాతో పోలుస్తున్నారు. ఏదేమైనా ఇద్దరు మహిళలను ప్రేమించి, వారిద్దరి అంగీకారంతో ఒకే వేదికపై పెళ్లి చేసుకోవడం అసాధారణమని, వసీం నిజంగా పెద్ద అద్భుతం చేశాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post