Rivaba Jadeja: టీమిండియా స్టార్ క్రికెటర్ భార్యకు మంత్రివర్గంలో స్థానం!

Rivaba Jadeja: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వస్థలమైన గుజరాత్‌లో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మొత్తం మంత్రివర్గం ఇటీవల రాజీనామా చేయగా, కేవలం రెండు రోజుల వ్యవధిలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. తాజాగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా చోటు దక్కించుకోవడం విశేషం.

Rivaba Jadeja
Rivaba Jadeja

రివాబా జడేజా వ్యక్తిగత జీవితం: రివాబా జడేజా 1990 నవంబర్ 2న గుజరాత్‌లోని రాజ్‌కోట్ నగరంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ప్రపుల్లాబా, హర్‌దేవ్ సింగ్ సోలంకి. గుజరాతీ సంప్రదాయ కుటుంబంలో పెరిగిన రివాబా చదువులో ప్రతిభ చూపారు. రాజ్‌కోట్‌లోనే విద్య పూర్తిచేసి, ఆత్మీయా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. 2016 ఏప్రిల్ 17న క్రికెటర్ రవీంద్ర జడేజాను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి రివాబా సోలంకి, రివాబా జడేజాగా మారిపోయారు.


రాజకీయాల్లో అడుగుపెట్టిన రివాబా: భర్త రవీంద్ర జడేజా భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని రివాబా నిర్ణయించారు. ఈ క్రమంలో 2019లో భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ విభాగాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆమె కృషిని గుర్తించిన బీజేపీ 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ సీటు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది. రవీంద్ర జడేజా భార్య తరపున బలమైన ప్రచారం చేయగా, రివాబా దాదాపు 60 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు.

మంత్రివర్గంలో చోటు: ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రివాబా జడేజా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. అభివృద్ధి పనులను కూడా ముందుండి నడిపించారు. ఆమె సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకోవాలని బీజేపీ నిర్ణయించడంతో, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కేబినెట్‌లో రివాబాకు చోటు కల్పించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. రివాబా ఏ శాఖ బాధ్యతలు స్వీకరిస్తారో అన్నది ఆసక్తిగా మారింది.

గుజరాత్ కొత్త మంత్రివర్గం:

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతున్నారు.

కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన సభ్యులు:
త్రికమ్ బిజల్ ఛంగ, స్వరూప్జి సర్దార్జి ఠాకూర్, ప్రవీణ్ కుమార్ మలి, రుశికేష్ గణేష్ భాయ్ పటేల్, పిసి బరంద, దర్శన ఎం వాఘేల, కంత్రతలాల్ శివలాల్ అమృతియ, కున్వర్జిభాయ్ మోహన్ భాయ్ బవాలియ, అర్జున్ భాయి దేవబాయి మోధ్వాడియా, డా. ప్రద్యుమన్ వజ, కౌశిక్ కంటిభాయి వెకారియా, పురుషోత్తమ్ భాయి ఓ సోలంకి, జితేంద్రభాయి సవ్జిభాయి వఘాని, రమన్ భాయి భిఖాభాయి సోలంకి, కమలేశ్ భాయి రమేష్ భాయి పటేల్, సంజయ్ సింహ్ రాజయ్ సింహ్ మహిద, రమేష్ భాయి భూరభాయి కతర, మనిష్ రాజీవ్ భాయి వకీల్, ఈశ్వర్ సింహ్ ఠాకోర్ భాయి పటేల్, ప్రఫుల్ పన్సేరియా, హర్ష్ సంఘ్వి, డా. జయరామ్ భాయి చెంభాయి గమిట్, నరేష్ భాయి మగన్ భాయి పటేల్, కనుభాయి మోహన్ లాల్ దేశాయి మరియు రివాబా జడేజా.

Also Read: భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం.. 2040లో చంద్రుడిపై వ్యోమగాములు

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post