BC Bandh in Telangana: తెలంగాణలో బీసీ సంఘాల బంద్.. రవాణా, విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం!

BC Bandh in Telangana: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు చేపట్టిన బంద్‌ కొనసాగుతోంది. బీసీ సంఘాల పిలుపుకు కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేయడంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్ డిపోల వద్ద బీసీ సంఘాల నేతలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

BC Bandh in Telangana
BC Bandh in Telangana

విద్యాసంస్థలు, వ్యాపారాలపై ప్రభావం: బంద్ కారణంగా విద్యాసంస్థలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. 


అయితే అత్యవసర సేవలను మాత్రం బంద్‌ నుంచి మినహాయించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని పోలీసులు సూచించారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎమ్మెల్యేల నిరసన: ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాలు వరుసగా బీసీలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. నిర్మల్ జిల్లా భైంసా డిపో ముందు బీసీ నాయకులు, రాజకీయ పార్టీల నేతలు కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఖమ్మంలోనూ బంద్ కొనసాగుతోంది.

ప్రజలకు ఇబ్బందులు: ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పండగ సమయం కావడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే దీనిని అదునుగా తీసుకున్న ప్రైవేట్ వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.


Post a Comment (0)
Previous Post Next Post