Planet Transit Predictions: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. ప్రతి నెల గ్రహాలు రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే అక్టోబర్ 16 తర్వాత కొన్ని శక్తివంతమైన గ్రహాలు రాశి, నక్షత్ర సంచారం చేయనున్నాయి. అందువల్ల ఐదు రాశుల వారికి నవంబర్ నెల వరకు ప్రత్యేక లాభాలు, రాజయోగం కనిపించనున్నాయి. వీరు పొందనున్న అదృష్టం, అవకాశాలను కిందివిధంగా వివరించవచ్చు.
![]() |
Planet Transit Predictions |
మేష రాశి వారికి అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 వరకు అదృష్టం తలుపు తడుతుంది. శక్తివంతమైన సూర్యుడు, కుజుడు, శుక్రుడు, రాహువు గ్రహాలు మేష రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. దీని ఫలితంగా ఆదాయం పెరుగుతుంది మరియు కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. మొత్తం నెల వీరికి లాభదాయకంగా ఉంటుంది.
Also Read: దీపావళి పండుగ తర్వాత ఈ రాశుల వారికి అదృష్ట యోగం!
వృషభ రాశి వారికి బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. దీని కారణంగా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది, కెరీర్‌లో మంచి అవకాశాలు కలుగుతాయి. అలాగే, నూతన గృహం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
సింహ రాశి వారికి గురు, శుక్ర, కుజ, బుధ, రాహువు గ్రహాల ప్రభావం వలన ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. గతకాలంలో ఎదురైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది, కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కరించబడతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది.
కర్కాటక రాశి వారికి ఊహించని విధంగా ఆర్థిక లాభాలు వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి కూడా అనేక అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగాన్ని పొందుతారు. సమాజంలో గౌరవం, మర్యాదలు లభిస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.
తుల రాశి వారికి నవంబర్ నెల వరకు అదృష్టం గలుగుతుంది. కలలో ఊహించని లాభాలు పొందుతారు. అనుకోని విధంగా జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఉద్యోగస్థులు ఉన్నత పదవులు పొందుతారు, వ్యాపారంలో పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడం వల్ల సంతోషకరమైన జీవితం అనుభవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.
Also Read: దీపావళి రోజు అమ్మవారి కటాక్షం పొందాలంటే పూజ ఎలా చేయాలి?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS