Diwali 2025 Special Significance: ఈ ఏడాది దీపావళి పండుగ విశిష్టత ఏంటి?

Diwali 2025 Special Significance: చిన్నా పెద్దా అందరూ ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగే దీపావళి. ఆశ్వీయుజ అమావాస్య నాడు వచ్చే ఈ వెలుగుల పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున రానుంది. జ్యోతిష్య పండితుల ప్రకారం, ఈసారి గ్రహాల అద్భుతమైన సంయోగం ఏర్పడటం వల్ల చాలా ఏళ్ల తరువాత లభించే ఈ ప్రత్యేక కలయికే ఈ దీపావళి విశిష్టతగా నిలుస్తుంది.

Diwali 2025 Special Significance
Diwali 2025 Special Significance

ఈ ప్రత్యేక సమయంలో మహాలక్ష్మీదేవిని ఆరాధించడం అత్యంత ఫలప్రదంగా ఉంటుందని, భక్తుల ఇంటిల్లిపాదికీ ఐశ్వర్యం, సుఖసంతోషాలు ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఈ నేపథ్యంలో దీపావళి పూజా విధానం, శుభముహూర్తాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


శుభముహూర్తం: అమావాస్య అక్టోబర్ 20వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2:32 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 21వ తేదీ మంగళవారం సాయంత్రం 4:26 గంటల వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం దీపావళిని అక్టోబర్ 20వ తేదీన జరుపుకుంటారు. లక్ష్మీదేవి, గణేశుని పూజించడానికి పవిత్రమైన సమయం మధ్యాహ్నం 2:39 గంటల నుండి అర్ధరాత్రి వరకు ఉంటుంది.

Diwali history and cultural meaning
Diwali history and cultural meaning

పూజకు శుభ లగ్నాలు:
కుంభ లగ్నం: మధ్యాహ్నం 2:09 నుండి 3:40 వరకు
వృషభ లగ్నం: సాయంత్రం 6:51 నుండి 8:48 వరకు
సింహ లగ్నం: రాత్రి 1:19 నుండి ఉదయం 3:33 వరకు


గ్రహాల ప్రత్యేక సంయోగం: ఈ దీపావళి రోజున కుజుడు, సూర్యుడు, బుధుడు ముగ్గురు కలయికవస్తారు. వీరి సమ్మిళిత ప్రభావం అన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుందని విశ్వసిస్తారు. కార్తీక అమావాస్య రాత్రి స్థిర లగ్నాలలో (వృషభ, సింహ, వృశ్చిక, కుంభ) మహాలక్ష్మిని పూజించడం శాశ్వత ఆనందం, ఐశ్వర్యం అందిస్తుందని శాస్త్రం చెబుతుంది.

Importance of Diwali celebration
Importance of Diwali celebration

మహాలక్ష్మి పూజా విశేషాలు: దీపావళి పండుగ మొత్తం ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజు ధనత్రయోదశి, రెండవ రోజు నరక చతుర్దశి, మూడవ రోజు ప్రధాన దీపావళి, నాలుగవ రోజు గోవర్ధన పూజ, ఐదవ రోజు భాయ్ దూజ్. దీపావళి రోజున గణేశుడు, లక్ష్మి, ఇంద్రుడు, కుబేరుడు, సరస్వతి, కాళీమాతను పూజించడం ఆనవాయితీ. ముఖ్యంగా శ్రీయంత్ర ప్రతిష్ఠ, పూజ ఈ రోజున అత్యంత మంగళప్రదమని భావిస్తారు. శ్రీయంత్రాన్ని పూజించే ఇంట్లో ఎప్పుడూ ధనసమృద్ధి ఉంటుందని నమ్మకం.


ధనత్రయోదశి: అక్టోబర్ 18న జరగనుంది. ఈ రోజున బంగారం, వెండి లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఇంటికి లక్ష్మీ కటాక్షాన్ని తెస్తుందని భావిస్తారు.

నరక చతుర్దశి: రాక్షసుడు నరకాసురుడి వధదినం. ఈ రోజున తెల్లవారుజామున స్నానం చేసి కొత్త బట్టలు ధరించడం ఆనవాయితీ.

Deepavali significance and traditions
Deepavali significance and traditions

దీపావళి:
చెడును తరిమికొట్టి మంచి గెలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకునే ఈ పండుగలో ఇళ్లను విద్యుద్దీపాలతో అలంకరించడం, బాణసంచా పేల్చుకోవడం, లక్ష్మీపూజ చేయడం, మిఠాయిలను పంచుకోవడం ప్రధాన సంప్రదాయాలు.

గోవర్ధన పూజ: శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ఘట్టాన్ని స్మరించుకుంటూ జరుపుకుంటారు.

భాయ్ దూజ్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ రోజు జరుపుకుంటారు.

మొత్తానికి, దీపావళి 2025 ప్రత్యేకత గ్రహాల అద్భుత సంయోగం, శుభ లగ్నాలు, పూజా విధానాల వల్ల ఈసారి దీపావళి భక్తి, ఆనందం, ఐశ్వర్యంతో నిండిన పండుగగా నిలిచిపోనుంది.


Post a Comment (0)
Previous Post Next Post