India First Indigenous Antibiotic Nafithromycin: భారత్‌లో స్వదేశీ యాంటీబయాటిక్ అభివృద్ధి!

India First Indigenous Antibiotic Nafithromycin: వైద్య పరిశోధన రంగంలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలోనే తొలిసారిగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ‘నాఫిథ్రోమైసిన్’ అనే కొత్త యాంటీబయాటిక్ అభివృద్ధి చేయబడిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. మొండిగా మారిన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో ఈ యాంటీబయాటిక్ అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆయన వెల్లడించారు.

India First Indigenous Antibiotic Nafithromycin
India First Indigenous Antibiotic Nafithromycin

శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ రోగులకు మేలు: ఢిల్లీలో జరిగిన ఒక వైద్య సదస్సులో మాట్లాడుతూ జితేంద్ర సింగ్, ముఖ్యంగా క్యాన్సర్ రోగులు, మధుమేహం నియంత్రణలో లేని వారికి ఈ ఔషధం ఎంతో మేలు చేస్తుందని వివరించారు. ఈ ఔషధానికి సంబంధించిన ఆలోచన నుంచి అభివృద్ధి వరకు, క్లినికల్ ప్రయోగాలు సహా మొత్తం ప్రక్రియ భారత్‌లోనే జరగడం దేశీయ ఫార్మా రంగ ఆత్మనిర్భరతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Also Read: పాక్ ఆర్మీ చీఫ్‌కు ఆఫ్ఘన్ మాజీ ఎంపీ గట్టి హెచ్చరిక!

హీమోఫిలియా జన్యు చికిత్సలో చారిత్రాత్మక విజయం: అదే సందర్భంలో హీమోఫిలియా వ్యాధికి జన్యు చికిత్సలో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిందని మంత్రి వెల్లడించారు. దేశీయంగా నిర్వహించిన తొలి క్లినికల్ ట్రయల్ విజయవంతమైందని, ఈ చికిత్స ద్వారా 60–70 శాతం వరకు వ్యాధిని సరిచేయగలిగామని తెలిపారు. ఈ ప్రయోగాల ఫలితాలు ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురించబడటంతో, భారత వైద్య పరిశోధనల సత్తా ప్రపంచానికి వెల్లడైందని ఆయన గర్వంగా తెలిపారు. ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం సహకారంతో వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ఈ పరిశోధనలు జరిగాయని వివరించారు.

Jitendra Singh Antibiotic Announcement
Jitendra Singh Antibiotic Announcement

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు: భారత్‌లో పరిశోధనలను మరింత ప్రోత్సహించేందుకు ఐదేళ్ల కాలానికి రూ. 50,000 కోట్ల బడ్జెట్‌తో ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ANRF) ఏర్పాటు చేస్తున్నట్లు జితేంద్ర సింగ్ ప్రకటించారు.

జన్యు సీక్వెన్సింగ్ లక్ష్యాలు: ఇప్పటికే భారత్ 10,000కు పైగా మానవ జన్యువులను సీక్వెన్స్ చేసిందని, ఈ సంఖ్యను పది లక్షలకు పెంచడం లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

ఆధునిక సాంకేతికతల అనుసంధానం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బయోటెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని జితేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.


Post a Comment (0)
Previous Post Next Post