How Much Gold Allowed Legally: రూల్స్ ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉండాలో తెలుసా?

How Much Gold Allowed Legally: భారతీయ కుటుంబాల్లో బంగారం అనేది సంపదకు, భద్రతకు, ఆచార సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో ఆదాయపన్ను (Income Tax) శాఖకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనలను పాటించకపోతే బంగారం స్వాధీనం (seizure) చేసే అవకాశమూ ఉంటుంది.

How Much Gold Allowed Legally
How Much Gold Allowed Legally

ఇంట్లో బంగారం ఉంచుకోవడానికి IT నిబంధనలు

ఆదాయపన్ను శాఖ ప్రకారం, ఇంట్లో ఉంచుకునే బంగారంపై ప్రత్యేకంగా పన్ను ఉండదు. కానీ బంగారం ఆదాయానికి తగినదేనా లేదా అనే దానిని పరిశీలిస్తారు. 2016లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం..

మహిళలకు: 500 గ్రాముల బంగారం ఉంచుకోవచ్చు.
అవివాహిత మహిళలకు: 250 గ్రాముల వరకు అనుమతి.
పురుషులకు: 100 గ్రాముల వరకు బంగారం ఉంచుకోవచ్చు.

ఇవి బ్యాంక్‌లోనో, ఇంట్లోనో, లాకర్‌లోనో ఉండవచ్చు. ఆదాయపన్ను అధికారులు రైడ్ చేసినా, ఈ పరిమితి వరకు ఉన్న బంగారాన్ని స్వాధీనం చేయరని స్పష్టం చేసింది.

Also Read: ప్రపంచంలోనే చౌకగా బంగారం లభించే దేశం గురించి మీకు తెలుసా?

బంగారం కొనుగోలు చేసినప్పుడు బిల్లు తప్పనిసరి

ఇంట్లో ఉన్న బంగారం ఎక్కడి నుండి వచ్చిందో నిరూపించలేకపోతే సమస్యలు తలెత్తే అవకాశముంది. కాబట్టి జ్యువెలరీ బిల్లు లేదా రసీదు తప్పనిసరిగా ఉంచుకోవాలి. వారసత్వంగా వచ్చిన బంగారం అయితే, దానికీ సంబంధించి ఫ్యామిలీ రికార్డులు లేదా విల్ డాక్యుమెంట్ ఉంచడం మంచిది. ఇలా చేస్తే ఎటువంటి ఇన్‌కమ్ టాక్స్ ఇన్వెస్టిగేషన్ వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం లేదు.

వివాహ బహుమతులుగా వచ్చిన బంగారం

వివాహ వేడుకల సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు ఇచ్చిన బంగారం కూడా వివాహ బహుమతిగా (gift) పరిగణించబడుతుంది. ఈ బహుమతులకు కూడా పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, ఈ బంగారం కూడా అసలు మూలం స్పష్టంగా ఉండాలి..అంటే ఎవరి నుండి వచ్చిందో, ఎప్పుడు ఇచ్చారో రికార్డు ఉంటే భవిష్యత్తులో ఎలాంటి సమస్య ఉండదు.

బంగారం మీద పన్ను ఎప్పుడు పడుతుంది?

మీరు బంగారం విక్రయించి లాభం పొందినప్పుడు, ఆ లాభంపై Capital Gains Tax విధిస్తారు.
తక్కువ కాలం (Short Term) మరియు దీర్ఘకాలం (Long Term) పన్నులు వేరువేరు ఉంటాయి.
బంగారం ఇన్వెస్ట్‌మెంట్ గా ఉంటే, దానిపై కూడా IT నియమాలు వర్తిస్తాయి.

భారత ప్రభుత్వం బంగారం ఉంచడాన్ని ఎవరూ నిషేధించలేదు. కానీ ఆ బంగారం మూలం చట్టబద్ధంగా ఉండాలి. బిల్లు, రసీదు, వారసత్వ పత్రాలు వంటి ఆధారాలు ఉంచుకుంటే ఎటువంటి భయమూ ఉండదు. సురక్షితంగా, చట్టపరంగా బంగారం ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత.

Also Read: బంగారం కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Post a Comment (0)
Previous Post Next Post