Lowest Gold Price Country: భారతదేశంలో బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ, దాదాపు రూ. లక్ష మార్క్‌ను చేరుకుంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు వెనుకంజ వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ఒక రోజు తగ్గితే, మరుసటి రోజు పెరుగుతాయి. కొన్నిసార్లు ధరలు స్థిరంగా ఉంటాయి. అయితే, ప్రపంచంలో అత్యంత చౌకగా బంగారం లభించే ప్రదేశం ఎక్కడో మీకు తెలుసా? నిజానికి, అలాంటి ఒక దేశం ఉంది.
![]() |
Bhutan |
ఆ దేశం మన పొరుగు దేశమైన భూటాన్. భూటాన్లో బంగారం చౌకగా లభించడానికి ముఖ్య కారణం, అక్కడ బంగారంపై పన్ను లేకపోవడం. ఇది ధరలు తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.
ఉదాహరణకు, భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.76,282 ఉంటే, భూటాన్లో అదే పరిమాణం బంగారం ధర కేవలం రూ.47,731 (భూటానీస్ న్గుల్తామ్) మాత్రమే ఉంటుంది. అంతేకాక, భూటాన్లో బంగారంపై దిగుమతి సుంకం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ బంగారం ధర మరింత అందుబాటులో ఉంటుంది.
అయితే, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. బంగారం ధరలు పెరుగుతున్న ఈ పరిస్థితిలో, నిర్లక్ష్యం వలన పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతాయి.
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS