Niharika NM Inspirational Story: సోషల్ మీడియాలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఎన్ ఎమ్ - ఇన్‌స్పైరింగ్ జర్నీ

Niharika NM Inspirational Story: మనలో చాలామంది ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఏం చేయాలో, మన టాలెంట్ ఏమిటో గుర్తించలేకపోతారు. అసలు ప్రతిభ ఏదో కనుక్కొని దాన్ని అందరికీ నచ్చేలా ప్రజెంట్ చేయడం చాలా ముఖ్యం. మనం చేయగలమనే నమ్మకం కలిగి ముందుకు సాగితే అసాధ్యం ఏదీ ఉండదు. సంకల్పాన్ని మించిన గెలుపు లేదు… భయాన్ని మించిన ఓటమి లేదు. కష్టపడి అలుపెరగని పోరాటం చేస్తే ఒకసారి సెలబ్రిటీ హోదా వస్తే, లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది. జనం మనల్ని చూసే దృక్పథం కూడా పూర్తిగా మారిపోతుంది.

Niharika NM Inspirational Story
Niharika NM Inspirational Story

ఇప్పుడంటే సెలబ్రిటీలు కేవలం సినిమా వాళ్లు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు మాత్రమే కాదు. సోషల్ మీడియా రాగానే ప్రతి ఒక్కరికీ తమ టాలెంట్ చూపించుకునే వేదిక దొరికింది. దాంతో, రాత్రికి రాత్రే చాలామంది సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.

Also Read: టాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ విజయ్-రష్మిక ఏజ్‌ గ్యాప్‌ ఎంతో తెలుసా?

నిహారిక ఎన్.ఎమ్ - ఓవర్‌నైట్ సోషల్ మీడియా స్టార్: సోషల్ మీడియా ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్న వారిలో నిహారిక ఎన్.ఎం ఒక ఉదాహరణ. మాటల్లో హాస్యం కలిపి వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత సినిమాల్లో కూడా నటించే స్థాయికి ఎదిగింది. కానీ ఈ స్థాయికి రావడానికి నిహారిక పడిన కష్టం అమోఘం.

చిన్ననాటి జీవితం: నిహారిక ఎన్.ఎం 1997 జూలై 4న చెన్నైలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు విజయవాడకు చెందినవారు కానీ ఉద్యోగ రీత్యా చెన్నైలో స్థిరపడ్డారు. పెరిగింది మాత్రం బెంగళూరులో. ఇంట్లో అమ్మానాన్నలు తెలుగులో మాట్లాడటంతో నిహారికకి తెలుగు మీద మంచి పట్టు ఏర్పడింది. చిన్నప్పుడు పాఠశాలలో చదవడం, పరీక్షలు రాయడం ఆమెకు ఇష్టం లేకపోయేది. ఏదైనా కొత్తగా చేయాలని ఆశపడేది కానీ ఆ కాలంలో టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో చదువులపై దృష్టి పెట్టక తప్పలేదు.

Niharika NM Inspirational Story
Niharika NM 

ఇక చిన్నతనంలో తాను లావుగా ఉండడం, కళ్లద్దాలు ధరించడం వల్ల చాలామంది బాడీ షేమింగ్ చేయడంతో నిహారిక చాలా బాధపడేది. తరచూ ఇంటికి వచ్చి ఒంటరిగా ఏడ్చేదట. ఈ అనుభవాలే ఆమెను కొత్తగా ఏదైనా చేయాలనే దిశగా నడిపించాయి.

Also Read: సమంత రెండో పెళ్లి అతనితోనా? వైరల్‌గా బ్యూటీ ఇన్స్‌టాగ్రామ్ పోస్ట్

సోషల్ మీడియాలో తొలి అడుగులు: ఆమె ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజాదరణను తెచ్చాయి. ముఖ్యంగా బ్రేకప్ లవర్స్ మీద చేసిన వీడియో ఆమెకు పెద్ద పేరును తెచ్చింది. కేవలం రెండు నెలల్లోనే 10 లక్షల సబ్‌స్క్రైబర్లు సంపాదించడం ఆమె ప్రాచుర్యానికి నిదర్శనం. అలాగే లిఫ్ట్‌లో ఎవరెవరూ ఎలా ప్రవర్తిస్తారు, ఎవరెవరిని ఎలా చూడతారు అన్న విషయాలను హాస్యంగా చూపిస్తూ చేసిన వీడియోలు కూడా విపరీతమైన గుర్తింపును తెచ్చాయి.

అంతర్జాతీయ గుర్తింపు: అమెరికాలో ఎంబీఏ చేస్తూ లాక్‌డౌన్ సమయంలో ఖాళీగా ఉండలేక వీడియోలు చేయడం ప్రారంభించింది. అలా చేసిన వీడియోలు ఆమెను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేశాయి. స్టార్ హీరోలైన మహేష్ బాబు, అజయ్ దేవగన్, యశ్ వంటి వారు కూడా తమ సినిమాల ప్రమోషన్ కోసం నిహారికతో వీడియోలు చేయాలని ముందుకొచ్చారు.

Niharika NM - Social Media Sensation's Memorable Moments With Celebrities
Niharika NM - Social Media Sensation's Memorable Moments With Celebrities 

ఆమె ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్పష్టంగా మాట్లాడగలదు. ఏ భాషలో మాట్లాడినా అది ఆమె మాతృభాషే అన్నంత స్థాయిలో సహజంగా మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా యూట్యూబ్ నిర్వహించిన ‘క్రియేటర్స్ ఫర్ చేంజ్’ అనే ఈవెంట్‌లో వరుసగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించడం ఆమె ప్రతిభకు నిదర్శనం.

సినిమాల్లో అడుగు: ప్రస్తుతం నిహారిక ‘మిత్రమండలికి’ అనే చిత్రంలో ప్రియదర్శి సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించింది. సినిమాలో ఆమె పాత్ర మంచి గుర్తింపును తెచ్చింది.

ఫాలోయింగ్ మరియు భవిష్యత్తు ప్రాజెక్టులు: ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 19 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఇండస్ట్రీలోని పలువురు హీరోలు, హీరోయిన్స్ కూడా ఆమెను ఫాలో అవుతున్నారు. ‘మిత్రమండలి’ సినిమాలో వచ్చిన క్రేజ్‌తో మరికొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.

సోషల్ మీడియా ద్వారా ప్రారంభమైన నిహారిక ఎన్.ఎం ప్రయాణం, కష్టపడి సాధించిన విజయాలు, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇవన్నీ ఆమె కథను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. నిహారిక ఉదాహరణతో ప్రతిఒక్కరికీ ఒక విషయం స్పష్టమవుతుంది - టాలెంట్‌కి వేదిక లభిస్తే, కష్టపడి ముందుకు సాగితే, ఏ కల అయినా నిజమవుతుంది.


Post a Comment (0)
Previous Post Next Post