Teacher's Day Significance: ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

Teacher's Day Significance: తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తారో, అదే స్థాయిలో ఉపాధ్యాయులు కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు. పుస్తకాల పాఠాలతో పాటు జీవిత విలువలను బోధించి, పిల్లలను మంచి పౌరులుగా మార్చడానికి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తారు.

Dr. Sarvepalli Radhakrishnan - A journey from educationist to philosopher and statesman
Dr. Sarvepalli Radhakrishnan - A journey from educationist to philosopher and statesman

జ్ఞానాన్ని పంచిపెట్టి, విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలుస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నిస్వార్థంగా పనిచేసే ఉపాధ్యాయులను గౌరవించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు వెనుక ఉన్న నేపథ్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?

భారతదేశ రెండవ రాష్ట్రపతి, తొలి ఉపరాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త, తాత్వికుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జీవితాంతం ఆయన విద్యా రంగానికి అంకితమై, విద్యార్థుల్లో జాతీయతా భావాన్ని పెంపొందించడంలో, సమాజాన్ని విద్యావంతం చేయడంలో కృషి చేశారు. అందుకే ఆయన చేసిన విద్యా సేవలను గౌరవించడానికి, అలాగే భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రను గుర్తు చేసుకోవడానికి ఈ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు.

Also Read: పురాణాల్లో ప్రసిద్ధి చెందిన మహాగురువులు ఎవరో తెలుసుకుందామా?

Teacher's Day Significance
Teacher's Day Significance

ఉపాధ్యాయ దినోత్సవ చరిత్ర

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశానికి రెండవ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో, ఆయన శిష్యులు, స్నేహితులు ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని అనుకున్నారు. దీనికి ఆయన స్పందిస్తూ.. “నా పుట్టినరోజును జరపడం కంటే, ఈ రోజును ఉపాధ్యాయుల కృషిని గౌరవించే దినంగా జరిపితే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది” అన్నారు. ఆయన సూచనను గౌరవిస్తూ అప్పటి నుంచి సెప్టెంబర్ 5న, ఆయన జన్మదినాన్నే దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించడం ప్రారంభమైంది.

Dr. Sarvepalli Radhakrishnan
Dr. Sarvepalli Radhakrishnan

ఉపాధ్యాయ దినోత్సవ ప్రాముఖ్యత

భారతీయ సంస్కృతిలో గురువుకి అత్యున్నత స్థానం ఉంది. ఉపాధ్యాయులు కేవలం పాఠ్య జ్ఞానాన్ని బోధించడమే కాదు, జీవన విధానం, నైతిక విలువలు, క్రమశిక్షణ వంటి అంశాలను నేర్పుతారు. అందువల్ల ప్రతి విద్యార్థి భవిష్యత్తు రూపకల్పనలో వారి పాత్ర అపారమైనది. సమాజానికి మంచిపౌరులను అందించడంలో ఉపాధ్యాయుల పాత్రను స్మరించుకోవడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం.

అదేవిధంగా, ఈ రోజున పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు తమ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే రాష్ట్రపతి, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేస్తారు.

Also Read: మూడు బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించగల బర్బరీకుని కథ మీకు తెలుసా?

మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post