Ancient Teachers: మన పురాణాల ప్రకారం “గురు” అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి. అలాంటి ఆది గురువులు అనేక మంది ఉన్నారని శాస్త్రాలు చెబుతున్నాయి. వారిలో ముఖ్యులు ద్రోణాచార్యుడు, వాల్మీకి, శుక్రాచార్యుడు, బృహస్పతి, వేదవ్యాసుడు, పరశురాముడు. వీరందరూ తమ జ్ఞానాన్ని కేవలం శిష్యులకే కాకుండా, సమస్త మానవ సమాజానికి పంచారు. సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం (Teacher’s Day 2025) సందర్భంగా వారిని ఒకసారి స్మరించుకుందాం.
![]() |
Dronacharya The Legendary Archer and Mentor in the Mahabharata |
ద్రోణాచార్యుడు: మహాభారతంలో ప్రసిద్ధిగాంచిన గురువులలో ద్రోణాచార్యుడు అగ్రగణ్యుడు. ఆయన పాండవులు, కౌరవులకు ఆయుధ విద్య బోధించారు. అర్జునుడిని అసాధారణ విలువిద్యలో దిట్టగా తీర్చిదిద్దారు. అందుకే మనం గుర్తించాల్సిన మహాగురువులలో ద్రోణాచార్యుడు ఒకరు.
![]() |
Rishi Vishwamitra |
Veda Vyasa - The Great Sage of Ancient India
వేద వ్యాసుడు: వేద వ్యాస మహర్షి హిందూ ధర్మంలో అత్యంత గొప్ప గురువుగా పరిగణించబడతారు. వేదాలను విభజించి, మహాభారతాన్ని రచించారు. పాండవులు, కౌరవులకు తాతగారిగా ప్రసిద్ధి పొందిన ఆయన తత్వవేత్తగా, కవిగా, మహర్షిగా సుస్థిరమైన స్థానం సంపాదించారు.
Vasishta Maharshi, a Brahmarshi who had won Anger and Desire
వశిష్ఠ మహర్షి: సప్తర్షుల్లో ఒకరైన వశిష్ఠుడు సూర్యవంశ రాజులకు కులగురువు. దశరథ మహారాజు, శ్రీరాముడు మరియు ఆయన సహోదరులకు గురువు. శ్రీరామునికి ధర్మం, రాజనీతి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు. ఆయన బోధనల సంకలనం “యోగవశిష్ఠం” గా ప్రసిద్ధి చెందింది, ఇది మానవ జీవన సూత్రాలు, ధర్మం, మోక్ష మార్గం గురించి వివరిస్తుంది.
వాల్మీకి మహర్షి: రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి భారతీయ సంస్కృతిలో శాశ్వత గుర్తింపును పొందారు. ఆయన రచన కేవలం శ్రీరాముడి కథ మాత్రమే కాక, ధర్మం, నీతి, జీవన విలువలను బోధించే గ్రంథం. వాల్మీకి, లవకుశులకు గురువుగా కీలక పాత్ర పోషించారు.
![]() |
Brihaspati |