Pawan Kalyan Heroine Ileana Welcomes Second Child: రెండో బిడ్డకు జన్మనిచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.! బేబీ ఫోటో, పేరు షేర్ చేసిన నటి

Pawan Kalyan Heroine Ileana Welcomes Second Child: టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ సరసన 'జల్సా' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ ఇలియానా, మరోసారి తల్లి అయ్యింది.


జూన్ 19న ఆమె తన రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మాత్రం ఆలస్యంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచు
కుంటూ చిన్నారి ఫొటోను షేర్ చేసింది. అదే పోస్టులో తన కొడుకుకు ‘కియాను రఫే డోలన్’ అనే పేరు పెట్టినట్టు పేర్కొంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


2023 ఆగస్టులో ఇలియానా తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. అతడికి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అనే పేరు పెట్టింది.
అదే సంవత్సరం ఇలియానా మైఖేల్ డోలన్‌ను రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె ప్రైవేట్ లైఫ్ గురించి వస్తోన్న విమర్శలకు తగిన బదులు ఇచ్చింది.

ఇలియానా సినీ కెరీర్‌ను వైవియస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాస్‌' సినిమా ద్వారా మొదలుపెట్టింది. ఆ తర్వాత 'పోకిరి'తో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ‘రాఖీ’, ‘ఖతర్నాక్’, ‘మున్నా’, ‘జల్సా’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Also Read: టీటు సింగ్ పునర్జన్మ కథ

తెలుగు చిత్రసీమలో టాప్ హీరోలతో కలిసి నటించిన ఇలియానా, కోటి రూపాయల పారితోషకం అందుకున్న తొలి హీరోయిన్‌గా రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.

తెలుగులో చివరిసారిగా రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో నటించింది. ఆ తర్వాత హిందీలో కొన్ని చిత్రాల్లో కనిపించిన ఇలియానా, ప్రెగ్నెంట్ కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం రెండో బిడ్డకు తల్లైన ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.

Also Read: దేశ భద్రత కోసం తన జీవితం త్యాగం చేసిన భారతీయ గూఢచారి

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post