Free Education: నేటి కాలంలో విదేశాల్లో చదవాలంటే లక్షల రూపాయల ఖర్చు అనివార్యం. కానీ మీ కలలను అడ్డుకునే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కొన్ని దేశాలు మంచి అవకాశాలు కల్పిస్తున్నాయి. విద్యను మానవ హక్కుగా భావించి, ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో బహుళ కోర్సులు అందిస్తున్నాయి. చదువుతో పాటు స్టైఫండ్, వసతి, ఉద్యోగ అవకాశాలకూ వీలు కల్పిస్తుండటంతో, ఇది చాలా మందికి ఆశాజనకంగా మారింది.
ఫిన్లాండ్ దేశం విద్యలో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది.
ఇక్కడ బ్యాచిలర్స్ నుంచి పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఫిన్నిష్ లేదా స్వీడిష్ భాషల్లో చదివే విదేశీ విద్యార్థులకు కూడా ఫీజు లేదు. పీహెచ్‌డీ చేస్తున్నవారికి స్టైఫండ్ రూపంలో జీతం కూడా ఇస్తారు. చదువు తో పాటు జీవనోపాధి కల్పించడంతో, ఇది మంచి అవకాశంగా మారింది.
జర్మనీకి ‘విద్యార్థుల స్వర్గధామం’ అనిపించేంత కారణం ఉంది.
ఇక్కడ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ట్యూషన్ ఫీజు అసలు ఉండదు. కేవలం చిన్న మొత్తంలో అడ్మిషన్ ఫీజు మాత్రమే వసూలు చేస్తారు. అది కూడా సౌకర్యాల నిర్వహణ కోసం. దాదాపు 300 ప్రభుత్వ యూనివర్శిటీల్లో 1000కు పైగా కోర్సులు ఉన్నాయి. విద్యార్ధులు ఇక్కడ చదువుతో పాటు ఇంటర్న్‌షిప్‌లకు, ఉద్యోగాలకు కూడా అవకాశాలు దొరుకుతాయి.
నార్వే దేశం కూడా విద్యను ఆదర్శంగా అభివృద్ధి చేసింది.
ఇక్కడ పాఠశాల నుంచి పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య అందుబాటులో ఉంది. విదేశీ విద్యార్థులకూ ఇది వర్తిస్తుంది. కానీ, నార్వేజియన్ భాష అనివార్యం. ప్రతి సెమిస్టర్‌కు 30–60 యూరోలు రుసుముగా వసూలు చేస్తారు. ఇది ఆరోగ్యం, కౌన్సిలింగ్, క్రీడలు వంటి సౌకర్యాలకు ఉపయోగపడుతుంది. ఇది ఖర్చు కాదు, మద్దతు.
స్వీడన్ కూడా పీహెచ్‌డీ విద్యార్థులకు ఉచితంగా కోర్సులు అందిస్తోంది.
యూరోపియన్ యూనియన్, స్వీడిష్ రెసిడెంట్లకు పూర్తిగా ఉచితంగా ఉండే విద్యను, ఇతర దేశాలకు చెందిన వారికీ తక్కువ ఫీజుతో అందిస్తోంది. ప్రతి సంవత్సరం లక్షల మంది విదేశీ విద్యార్థులు ఇక్కడ ప్రవేశం పొందుతారు. పీహెచ్‌డీ విద్యార్థులకు చదువుతో పాటు జీతం కూడా ఇస్తారు. ఇది అకడమిక్ కెరీర్‌ను నిర్మించాలనుకునేవారికి గొప్ప అవకాశం.
Also Read: ఖాళీ సీసాలతో నెలకు రూ.2 లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియా!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS