Janhvi Kapoor: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో యావత్ భారతీయ సినిమా రంగంలో చాలా మంది నటీనటులు రెస్టు లేకుండా సినిమాల కోసం విపరీతంగా కష్టపడతారు.
![]() |
Ram Charan, Janhvi Kapoor and Buchi Babu Sana |
దాంతో వారికీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలోనే అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గత సంవత్సరం చేసిన ‘దేవర’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె రామ్ చరణ్‌తో ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తోంది.
Also Read: అతిలోక సుందరి శ్రీదేవి సృష్టించిన అరుదైన రికార్డు!
అయితే కెరీర్ ప్రారంభమైన కొద్దికాలంలోనే జాన్వీ బిజీగా మారి, రెస్టు లేకుండా అనేక ప్రాజెక్టుల్లో నటిస్తూనే వచ్చింది. ఒకసారి చెన్నైలో షూటింగ్ ముగించుకొని ముంబై వెళ్లేందుకు విమానం ఎక్కిన సందర్భంలో కడుపులో తీవ్ర నొప్పి వచ్చింది. ముంబైలోని తన ఇంటికి చేరుకునే లోపే పెరాలసిస్ లక్షణాలు తలెత్తి, చేతులు, కాళ్లు వంకరగా తిరిగిపోయాయని ఆమె ఒక సందర్భంలో చెప్పింది. అప్పట్లో తీసుకున్న ట్రీట్మెంట్ కారణంగానే ఇప్పుడు కూడా కొన్ని మందులు వాడుతున్నానని వెల్లడించింది.
![]() |
Janhvi Kapoor |