Samantha - Raj Nidimoru Viral Pics: నాగ చైతన్యతో విడాకుల అనంతరం సింగిల్‌గా జీవనం సాగిస్తున్న సమంత గురించి తాజాగా ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి.
బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె ప్రేమలో ఉన్నారని, ఈ జంట సీక్రెట్ డేటింగ్ చేస్తోందని టాక్ బలంగా వినిపిస్తోంది. ఇటీవల సమంత, రాజ్ నిడిమోరు కలిసి ఉన్న పర్సనల్ ఫోటోలు లీక్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక అమెరికా టూర్ సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోస్‌ను చూసి అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఇవే రెండో పెళ్లికి క్లియర్ హింట్‌గా భావిస్తున్నారు.
తానా 2025 సందర్భంగా అమెరికా వీధుల్లో సమంత - రాజ్
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2025 వేడుకల్లో పాల్గొన్న సమంత, అక్కడి వీధుల్లో రాజ్ నిడిమోరుతో కలిసి విహరించిన ఫోటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఒక ఫోటోలో రాజ్, సమంత భుజంపై చేయి వేసి, ఆప్యాయంగా నవ్వుకుంటూ నడుస్తున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన వారు “ఇంత చనువు ఉండడం పక్కాగా డేటింగ్ సాక్ష్యం”గా అభిప్రాయపడుతున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ట్రిప్స్ హైలైట్ – పెళ్లి వార్తలకు బలం
ఇతర ప్రయాణాల్లోనూ సమంత, రాజ్ కలిసి కనిపించడం కొత్త కాదు. గత కొంతకాలంగా వీరి ట్రిప్స్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఫోటోలు వెలుగులోకి రావడంతో త్వరలోనే సమంత రెండో పెళ్లి శుభవార్త అందుతుందని ప్రచారం ఊపందుకుంది.
ఆగస్ట్‌లో పెళ్లి..? ఫిలిం నగర్ చర్చ
ఫిలిం నగర్ వర్గాల ప్రకారం సమంత – రాజ్ నిడిమోరుల పెళ్లి ఆగస్ట్ నెలలో జరగనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇరు కుటుంబాలూ ఈ వివాహానికి అంగీకారం తెలిపినట్టు సమాచారం, పెళ్లి తేదీ ప్రకటించడమే ఆలస్యం అని వదంతులు వినిపిస్తున్నాయి.
కెరీర్ పరంగా స్ట్రాంగ్ స్టెప్స్ – నిర్మాతగా సమంత
వ్యక్తిగత జీవితం ఒక్కవైపు సాగుతుండగా, తన సినీ కెరీర్ విషయంలో సమంత చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఇకపై తాను కేవలం ఛాలెంజింగ్ పాత్రలకే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేసింది. సినిమాల ఎంపికలో తగినంత అవగాహనతో, ఆలోచించి మాత్రమే ముందుకు వెళ్తానని తెలిపింది.
హీరోయిన్‌గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎదగాలన్న సంకల్పంతో సమంత ‘శుభం’ అనే సినిమా నిర్మించింది. కొత్త బ్యానర్ కింద రూపొందించిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో పాటు, సమంతకు వాణిజ్యంగా మంచి లాభాలూ అందాయి.
అక్కినేని కోడలిగా..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా సమంత కెరీర్ పీక్స్ ఉన్న సమయంలో అక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టారు. నాగ చైతన్యతో పెళ్లి అనంతరం నాలుగేళ్ల పాటు వివాహ బంధాన్ని కొనసాగించారు. ఆపై విడాకులు ప్రకటించడం, తర్వాన మాయోసైటిస్ వంటి రేర్ వ్యాధితో పోరాడటం వంటివి ఆమెను మానసికంగా మరింత ప్రభావితం చేశాయి.
ఈ క్రమంలో సమంత రెండో వివాహంపై వస్తున్న వార్తలు అభిమానుల మధ్య ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పెళ్లి జరగుతుందా లేదా అన్నదానిపై ఇంకా అధికారికంగా ఏ సమాచారం అందనప్పటికీ, మీడియాలో ఈ విషయంపై చర్చ మాత్రం ఊపందుకుంది.
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS