Sridevi's 62nd Birth Anniversary: అతిలోక సుందరి శ్రీదేవి సృష్టించిన అరుదైన రికార్డు!

Sridevi's 62nd Birth Anniversary: టాలీవుడ్‌లో ఇప్పటివరకు వందలాది మంది హీరోయిన్లు రాగా, మరెంత మంది వస్తూనే ఉన్నారు. కానీ శ్రీదేవి సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం పూర్తిగా వేరే స్థాయిలో నిలిచింది. 

Sridevi with her Husband Boney Kapoor
Sridevi with her Husband Boney Kapoor

ఎందుకంటే ఆమె వన్ అండ్ ఓన్లీ “అతిలోక సుందరి”గా చరిత్రలో చిరస్థాయిగా ముద్ర వేసుకుంది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన ఈమె, ప్రమాదవశాత్తు కన్నుమూసిన విషయం ఇప్పటికీ అభిమానులను కలచివేస్తుంది. ఈ అన్ని జ్ఞాపకాలను పక్కన పెడితే, నేడు ఆమె జయంతి. ఈ సందర్భంగా శ్రీదేవి సృష్టించిన అరుదైన రికార్డు గురించి తెలుసుకుందాం.

Sridevi's 62nd Birth Anniversary
Sridevi

1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించింది శ్రీదేవి. ఆమె అసలు పేరు “శ్రీ అమ్మ అయ్యంగర్”. నాలుగేళ్ల వయసులోనే ఒక తమిళ సినిమాలో నటించి, అప్పటినుంచి తన స్క్రీన్ నేమ్‌ను “శ్రీదేవి”గా మార్చుకుంది. 1970 నుంచి ప్రారంభమైన ఆమె సినీప్రయాణం దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కొనసాగి, సుమారు 200కి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

Sridevi's 62nd Birth Anniversary
Sridevi's 62nd Birth Anniversary

తెలుగులో హీరోయిన్‌గా శ్రీదేవికి తొలి అవకాశం దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన మా బంగారక్క సినిమాతో వచ్చింది. అయితే కె. రాఘవేంద్రరావు తీసిన పదహారేళ్ల వయసు ఆమెను ఒక్కరాత్రిలోనే సూపర్ స్టార్‌గా మార్చింది. ఆ తరువాత ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ తదితర స్టార్ హీరోలతో వరుసగా హిట్ చిత్రాలు చేసింది.

Sridevi with her Elder daughter Janhvi Kapoor
Sridevi with her Elder daughter Janhvi Kapoor

శ్రీదేవి కెరీర్‌లోని ఒక విశేషం ఏమిటంటే.. బాలనటిగా ఉన్నప్పుడు పలువురు స్టార్ హీరోలకు మనవరాలు, కూతురి పాత్రలు చేసిన ఆమె, పెద్దయ్యాక వారిలో కొందరితో హీరోయిన్‌గా జతకట్టడం. ఈ రికార్డు ఇప్పటివరకు ఏ హీరోయిన్ సాధించలేదు, భవిష్యత్తులో కూడా సాధ్యంకాకపోవచ్చు. ఈ ఘనత పూర్తిగా శ్రీదేవిదే.

Sridevi with her younger daughter Kushi Kapoor
Sridevi with her younger daughter Kushi Kapoor

ఆమెకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలు. కానీ ఈ ఇద్దరూ నటించడాన్ని తాను చూడకుండానే శ్రీదేవి కన్నుమూసింది. బహుశా ఇదే ఆమె జీవితంలో తీరని లోటు అని చెప్పవచ్చు. 2018 ఫిబ్రవరిలో ప్రమాదవశాత్తు ఆమె మరణించగా, అదే ఏడాది జూలైలో పెద్ద కుమార్తె జాన్వీ తొలి సినిమా విడుదలైంది. ప్రస్తుతం జాన్వీ హిందీతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది.


మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post