Smartphone Addiction: స్మార్ట్‌ఫోన్ వాడకం వల్ల డిప్రెషన్, నిద్రలేమి.. తాజా అధ్యయనం హెచ్చరిక!

Smartphone Addiction: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ లేకుండా జీవించడం చాలా కష్టమైన విషయమే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతిలో ఎక్కువ సమయం ఫోన్‌నే ఉంటుంది. కానీ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం శరీరానికీ, మనసుకీ హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటలకొద్దీ వీడియోలు చూడటం, సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది.

Smartphone Addiction

తాజా పరిశోధన ఏమి చెబుతోంది..?

2023లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న 655 మందిని పరిశీలించారు. ఈ పరిశోధన ప్రకారం, ఫోన్ ఎక్కువగా వాడేవారు డిప్రెషన్, ఆందోళన, నిద్రలేమి సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా రాత్రిపూట నిద్ర మధ్యలో మెలకువ రావడానికి ప్రధాన కారణం ఫోన్ వాడకమేనని ఈ అధ్యయనం వెల్లడించింది.

మానసిక సమస్యలకు కారణాలు

ఈ పరిశోధనలో చెప్పినట్లుగా మానసిక సమస్యలకు అనేక కారణాలున్నాయి. వాటిలో ఫోన్ వాడకం ప్రధానమైనది.

  • 40% సమస్యలు సోషల్ మీడియా వినియోగం వల్ల వస్తున్నాయి.
  • 12% సమస్యలు నిద్రలేమి కారణంగా ఏర్పడుతున్నాయి.
  • 13% సమస్యలు కుటుంబ సమస్యల వలన వస్తున్నాయి.
  • 10% సమస్యలు సైబర్ వేధింపుల కారణంగా వస్తున్నాయి.

ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవడం ఎలా..?

  • మీ ఫోన్‌లో అవసరం లేని నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి.
  • రోజులో ఎంతసేపు ఫోన్ వాడాలో ఒక సమయ పరిమితి పెట్టుకోండి.
  • సోషల్ మీడియా కోసం రోజుకు 30 నిమిషాల టైమర్ సెట్ చేసుకుని, సమయం ముగిసిన వెంటనే లాగ్ అవుట్ అవ్వండి.

సోషల్ మీడియాలో ప్రతికూల వార్తలు చూడటం తగ్గించి, బదులుగా పుస్తకాలు చదవడం, వాకింగ్ చేయడం, కుటుంబం లేదా స్నేహితులతో సమయం గడపడం అలవాటు చేసుకోండి.

Also Read: వర్షాకాలంలో ఆరోగ్యం కాపాడే బెస్ట్ సూపర్ ఫుడ్స్!

Post a Comment (0)
Previous Post Next Post