Kavitha New Political Party: రాజకీయాల్లో శాశ్వత స్థానాలు ఎవరికి ఉండవు. ఒక దశలో కొత్త మార్గం వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. గులాబీ పార్టీలో కవితకు స్థిరమైన స్థానం ఉన్నట్టే కనిపించింది. అయితే అనుకోకుండా జరిగిన హఠాత్ పరిణామాలు ఆమె స్థానాన్ని ప్రశ్నార్థకం చేశాయి. అంతేకాదు, ఆమె బయటపెడుతున్న సంచలన వ్యాఖ్యలను తట్టుకోలేక అధిష్టానం ఆమెను పార్టీ నుంచి తప్పించింది. దీంతో కవిత తనకంటూ కొత్త రాజకీయ వేదికను సృష్టించుకోవాల్సిన అవసరం వచ్చింది.
తెలంగాణ మీడియా వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం దాదాపు ఖాయం. దీపావళి నాటికి పార్టీని ప్రకటించి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తన నివాస ప్రాంతంలో మూడు అంతస్తుల బంగ్లాను అద్దెకు తీసుకుని, అక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల తన జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కొన్ని జిల్లాల నాయకత్వాలను ప్రకటించారు. ఇంకా కొన్ని జిల్లాల నాయకత్వాలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు, జాగృతి ఆధ్వర్యంలో "లీడర్" అనే కార్యక్రమాలు నిర్వహించి, తెలంగాణ కవులు, కళాకారులను సన్మానించారు. త్వరలో మరిన్ని కార్యక్రమాలు చేపడతానని ఆమె వెల్లడించారు.
Also Read: స్టార్ హీరో నుంచి రాజకీయ నాయకుడి వరకు ఆయన అద్భుత ప్రయాణం!
బీసీల హక్కులు, రిజర్వేషన్ల కోసం కవిత కొంతకాలంగా గళమెత్తుతున్నారు. ఇప్పుడు తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి, స్వంత రాజకీయ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకునే అవకాశం ఏర్పడింది. అయితే ఒక రాజకీయ పార్టీ విజయవంతం కావాలంటే బలమైన నాయకత్వం, క్షేత్రస్థాయి cadre అవసరం. కవిత పార్టీ పెడితే, ఆమెతో వెళ్ళేవారు ఎవరు, నిలబడేవారు ఎవరు అన్నది చూడాలి.
ఇటీవల కవితపై వచ్చిన ఒక వ్యాఖ్య తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యను సిరికొండ మధుసూదనాచారి తప్ప మరెవ్వరూ ఖండించలేదు. గులాబీ పార్టీలోని ఇతర నాయకులు మాత్రం నిశ్శబ్దంగా ఉన్నారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో గులాబీ పార్టీకి చెందిన పలువురు నాయకులు కవితను "అన్‌ఫాలో" చేస్తున్నారు. ఆమెపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఇవన్నింటిని తట్టుకుని నిలబడగలరా? నిలబడి కొత్త రాజకీయ శక్తిని నిర్మించగలరా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆమె ముందు నిలిచాయి. వీటికి సమాధానం సమయం గడుస్తున్న కొద్దీ బయటపడనుంది.
Also Read: మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS