South Asia Political Instability: ఎక్కడో రగిలిన నిప్పు అడవిని మొత్తం దహనం చేస్తుంది. అలాగే ఎక్కడో ఒకచోట మొదలైన పుకారు వ్యవస్థను మొత్తం కుదిపేస్తుంది. దాని వలన కలిగిన నష్టం తర్వాత గాని గ్రహించలేం. నిజానికి పుకార్లు సృష్టించడం చాలా ఈజీ. లేనిపోని వ్యాఖ్యలు చేయడం మరింత ఈజీ. కానీ వాటి తర్వాత వచ్చే పరిణామాలను అదుపులో పెట్టడం మాత్రం అంత ఈజీ కాదు. అప్పటికే పరిస్థితి చేతికి అందకుండా పోతుంది కాబట్టి ఏమీ చేయలేని దుస్థితి వస్తుంది. ప్రస్తుతం నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలు కూడా అదే తరహాలో ఉన్నాయి.
![]() |
America and China |
కొన్ని సంవత్సరాల క్రితం శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనలు ప్రారంభించారు. దానికి ముందు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రజలు అధికారపక్షంపై తూటాలు దించారు. కుటుంబ పాలన, అవినీతి, ఒప్పందాలు… ఇవన్నీ శ్రీలంక పరిస్థితి కూలిపోవడానికి ప్రధాన కారణాలుగా అంతర్జాతీయ మీడియా రాసింది. అసలు శ్రీలంక కేసులో అంతర్జాతీయ మీడియా ఈ స్థాయిలో స్పందించడం అదే తొలిసారి. దాని వెనుక అసలు ఏం జరిగింది, ఎవరి హస్తం ఉందన్నది పరిశీలిస్తే అమెరికా తాళ్లు లాగిందని తేలిపోయింది. ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం శ్రీలంకలో ఉండడంతో అక్కడ జరిగే పరిణామాలు బయటకు రాలేకపోతున్నాయి. పైగా అక్కడి సహజ వనరులపై అమెరికన్ కంపెనీలు కన్నేశారు. అనుకూల ప్రభుత్వం ఉండటంతో వాటిని దోచుకుపోతున్నారని అక్కడి నాయకులు ఆరోపిస్తున్నారు.
అమెరికా సముద్రంలో స్థావరం ఇవ్వనందుకు బంగ్లాదేశ్‌పై కక్ష కట్టింది. అక్కడే ఒక ఉద్యమాన్ని మొదలుపెట్టింది. అది ప్రధానమంత్రిని దేశం విడిచి పారిపోవాల్సిన స్థితికి తెచ్చింది. ఫలితంగా రకరకాల విధ్వంసాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికీ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ అల్లర్లు ఆగలేదు. విధ్వంసం తగ్గలేదు. ఈ పరిస్థితికి ప్రధాన కారణం అమెరికానే అని షేక్ హసీనా ఆరోపించారు. ఆమె ఇప్పటికీ అదే మాట మీద కట్టుబడి ఉన్నారు. దేశంలో అల్లర్లు జరుగుతుండటంతో ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు.
![]() |
South Asia Political Instability |
ఇప్పుడు నేపాల్‌లో కూడా ఇదే తరహా అల్లర్లు జరుగుతున్నాయి. ఏకంగా పార్లమెంటుకు నిప్పు పెట్టేశారు ఆందోళనకారులు. ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం కలిగించారు. ఇది ఎటు దారితీస్తుందో అర్థం కావడం లేదు. అక్కడి సైన్యం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటికీ గొడవలు తగ్గడం లేదు. అధికారపక్షం, ప్రతిపక్షం.. ఇద్దరి నాయకులు దేశం విడిచి వెళ్లిపోయారు. జరుగుతున్న గొడవల్లో ఇప్పటివరకు 20 మంది మృతి చెందారని చెబుతున్నారు.
మన చుట్టుపక్కల దేశాల్లో అంతర్యుద్ధాలు రగిలించి, ఆర్థికంగా బలహీనపరచే ప్రయత్నాన్ని అమెరికా, చైనా లాంటి దేశాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో రైతు ఉద్యమం కూడా అలాంటి కుట్రలో భాగమేనని, దానిని సమర్థవంతంగా ఎదుర్కొని మోడీ నిలబడ్డారని అంటున్నారు. కానీ ఇప్పటికీ భారతదేశంలో కొత్తగా అలాంటి గొడవలు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని, దాని వెనుక డ్రాగన్, అమెరికా హస్తం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.