Govt delivers 'GST Diwali bonanza': దసరా, దీపావళి గిఫ్ట్‌.. జీఎస్టీ కౌన్సిల్‌ కీలక నిర్ణయాలు!

Govt delivers 'GST Diwali bonanza': దసరా, దీపావళి పండుగల ముందు ప్రజలకు పెద్ద ఊరటనిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీకి తగ్గట్టుగానే జీఎస్టీ కౌన్సిల్‌ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న జీఎస్టీ స్లాబ్‌లను రద్దు చేసి, కేవలం రెండు స్లాబ్‌లు మాత్రమే ఉంచింది. 


అవి 5% మరియు 18%. కొన్నింటిపై పూర్తిగా జీఎస్టీనే తొలగించింది. ఒక కుటుంబానికి నెలకు సగటున కనీసం రూ.1500 నుంచి రూ.2000 వరకూ ఆదా అయ్యే అవకాశం ఉందని అంచనా. ఇంటి కిరాణా నుంచి వాహనాలు, ఎలక్ట్రానిక్స్ వరకు అనేక వస్తువుల ధరల్లో లాభాలు కనిపించనున్నాయి.

నిత్యావసర వస్తువులపై భారీ తగ్గింపు

  • హెయిర్ ఆయిల్‌, టూత్‌పేస్ట్‌, టూత్ బ్రష్‌లు, సబ్బులు, షేవింగ్ క్రీమ్‌లపై జీఎస్టీని 18% నుంచి 5%కు తగ్గించారు.
  • వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ప్రీ-ప్యాకేజ్డ్‌ నమ్‌కీన్‌, మిక్చర్, వంట సామగ్రి, పాల సీసాలు వంటి వాటిపై 12% నుంచి 5%కి జీఎస్టీ తగ్గింది.
  • ప్యాకేజ్డ్ చపాతీ, రోటి, పరోటా, డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌, సీ-ఫుడ్‌, ఐస్‌క్రీమ్స్‌, ఫ్రూట్ డ్రింక్స్‌పై కూడా 12% నుంచి 5% జీఎస్టీ అమలవుతుంది.
  • బేకరీ ఉత్పత్తులు, పన్నీర్‌, చెనా, సాస్‌, సలాడ్స్‌, జామ్‌, జెల్లీస్‌, ప్లాంట్ బేస్డ్‌ మిల్క్‌, భుజియా అన్నీ 12% నుంచి 5%కి చేరాయి.
Govt delivers 'GST Diwali bonanza

Also Read: నవంబర్‌లో ఏలియన్స్ దాడి? భూమిపైకి దూసుకొస్తున్న రహస్య వస్తువు!

వ్యవసాయ రంగానికి ఊరట

  • ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలు, బయో పెస్టిసైడ్స్‌, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలు అన్నింటిపై జీఎస్టీని 12% నుంచి 5%కు తగ్గించారు.
  • రైతులకు ఇది పెద్ద లాభం కానుంది.
Govt delivers 'GST Diwali bonanza'
Govt delivers 'GST Diwali bonanza'

ఇన్సూరెన్స్ & హెల్త్ సెక్టార్‌లో పెద్ద నిర్ణయం

  • వ్యక్తిగత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్‌, హెల్త్ ఇన్సూరెన్స్‌లపై 18% జీఎస్టీని పూర్తిగా తొలగించారు. ఇకపై బీమాపై జీఎస్టీ ఉండదు.
  • మెడికల్ ఆక్సిజన్‌, డయాగ్నొస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్‌, కళ్లజోళ్లు మొదలైన వాటిపై 12% నుంచి 5%కి తగ్గింపు ఇచ్చారు.
  • హాస్పిటల్ బిల్లులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
  • ఆటోమొబైల్ రంగంలో ఊరటనిచ్చిన జీఎస్టీ కౌన్సిల్‌
  • ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18% కు తగ్గించారు.
  • పెట్రోల్‌, పెట్రోల్‌ హైబ్రిడ్‌, 1200 CC లోపు ఉన్న LPG, CNG కార్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గనుంది.
  • డీజిల్‌, 1200 CC లోపు ఉన్న డీజిల్‌ హైబ్రిడ్ కార్లు, ట్రైసైకిల్స్‌ కూడా 18% స్లాబ్‌లోకి వచ్చాయి.
  • 350 CC వరకు ఉన్న బైక్‌లు, మినీ లారీలు, DCMలు, ట్రాలీ ఆటోలు అన్నీ 18% జీఎస్టీ కిందకు వస్తాయి.

ఎలక్ట్రానిక్స్ & గృహోపకరణాలపై తగ్గింపు

  • 32 అంగుళాలకు మించిన టీవీలు, ఏసీలు, కంప్యూటర్ మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్‌వాషింగ్ మిషన్లపై జీఎస్టీని 28% నుంచి 18%కు తగ్గించారు.


Post a Comment (0)
Previous Post Next Post