Language Training for Nurses: జపాన్, జర్మనీ దేశాల్లో నర్సులపై పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలను బోధించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) సహకారం తీసుకోనుంది. త్వరలోనే ఆరోగ్యశాఖ, EFLU మధ్య ఒప్పందం కుదరనుందని సమాచారం.
![]() |
| Language Training for Nurses in Telangana |
కోర్సు లక్ష్యాలు, వివరాలు
నాలుగేళ్ల డిగ్రీ కోర్సులో భాగంగా ఈ భాషా శిక్షణను రెండో సంవత్సరం, మూడో సంవత్సరాల్లో అందించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో జపనీస్ N3 స్థాయి (ఇంటర్మీడియట్), జర్మన్ B2 స్థాయి (అప్పర్-ఇంటర్మీడియట్) బోధిస్తారు. ప్రారంభ దశలో తరగతులు ఆన్‌లైన్‌లో ఉంటాయి. తరువాత విద్యార్థులను మరింత శిక్షణ కోసం యూనివర్సిటీకి పంపే అవకాశం ఉందని EFLU అధికారులు పేర్కొన్నారు. భాషతో పాటు విదేశీ సంస్కృతి గురించి కూడా అవగాహన కల్పిస్తారు.
Also Read: విదేశీ భాషలు నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు!
తెలంగాణలో నర్సింగ్ సీట్లు పెరుగుదల
ప్రస్తుతం రాష్ట్రంలో 37 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. అందులో 16 కళాశాలలు గతేడాదే ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం సుమారు 2,360 మంది విద్యార్థులు ఈ కళాశాలల్లో చేరుతున్నారు. 2022లో సీట్లు 1,410 మాత్రమే ఉండగా, ఈ ఏడాది వాటి సంఖ్య 2,360కి పెరిగింది.
వేతనాల తేడా - దేశీ vs విదేశీ
తెలంగాణలో ప్రభుత్వ నర్సులకు సగటున సంవత్సరానికి ₹6 లక్షల వేతనం లభిస్తోంది. అదే జపాన్, జర్మనీలో ఈ వేతనం ₹18 లక్షల నుంచి ₹24 లక్షల వరకు ఉంటుంది. అందువల్ల అక్కడ పనిచేయాలనే ఆసక్తి మరింతగా పెరుగుతోంది.
గ్లోబల్ డిమాండ్ పెరుగుతోంది
జపాన్‌లో వృద్ధ జనాభా అధికంగా ఉండటంతో, అక్కడ 19.6 లక్షల నుంచి 20.6 లక్షల నర్సింగ్ నిపుణులు అవసరమవుతున్నారు. కానీ ప్రస్తుతానికి 3 లక్షల నుంచి 13 లక్షల వరకు నర్సుల కొరత ఉంది. జర్మనీలో కూడా 2030 నాటికి అర మిలియన్ (5 లక్షల) నర్సులు కావాలని అంచనా. ఈ లోటును భర్తీ చేయడానికి, ఈ రెండు దేశాలు విదేశాల నుంచి నర్సులను ఆహ్వానిస్తున్నాయి.
Also Read: తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఉచిత విద్య అందించే దేశాలు!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
