Marigold Farming: ఎన్నో రకాల పుష్పాల్లో, బంతిపూలకు ప్రత్యేక స్థానం ఉంది. పండుగలు, శుభకార్యాలు, వేడుకలు ఏవైనా బంతిపూల అలంకరణ తప్పనిసరి. ఈ పూల రంగు, సౌందర్యం వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చేస్తాయి. అందుకే వీటికి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ఫలితంగా రైతులు బంతిపూల సాగుతో మంచి లాభాలను సాధిస్తున్నారు.
![]() |
Marigold Farming |
దిగుబడి లెక్కలు: ఒక ఎకరా భూమిలో సగటున 5,000 నుంచి 8,000 కిలోల వరకు బంతిపూలు దిగుతాయి. కార్తీక మాసంలో కిలో ధర సుమారు రూ.200 వరకు ఉండటంతో, కేవలం 5,000 కిలోలతోనే రైతులు సుమారు రూ.10 లక్షల వరకు సంపాదించగలరు. దసరా, దీపావళి, కార్తీక మాసం, పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి వేళల్లో బంతిపూలకు డిమాండ్ రెట్టింపవుతుంది. కాబట్టి రైతులు ముందుగానే సాగు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మరింత లాభాలు పొందవచ్చు.
సమయం కీలకం: బంతిపూల పంట సాధారణంగా 3-4 నెలల్లో కోతకు వస్తుంది. ఈ వ్యవధిలో రైతులు 8-10 సార్లు కోత చేయవచ్చు. కార్తీక మాసానికి పూలు అందుబాటులో ఉండాలంటే సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో విత్తనాలు నాటాలి. జూలై-ఆగస్టులో నాటితే వర్షాల కారణంగా మొక్కలు దెబ్బతినే అవకాశముంది. సరైన కాలంలో నాటితే పువ్వులు సరైన సమయానికి కోసుకోవచ్చు.
Also Read: పెట్టుబడి లేకుండా కూడా బిజినెస్ చేసే బెస్ట్ ఐడియాలు ఇవే!
విత్తనాల రకాలు: బంతిపువ్వుల విత్తనాల్లో అనేక రకాలున్నా, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఆఫ్రికన్ బంతి రకం విత్తనాలు వాడుతారు. ఇవి పెద్దవిగా, ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఎక్కువ దిగుబడి ఇస్తాయి. అలంకరణలలో, దండల్లో వీటి వినియోగం విస్తృతంగా ఉంటుంది. ఏపీలో తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాలు బంతిపూల ప్రధాన ఉత్పత్తి ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల నేల, వాతావరణం సాగుకు అనుకూలం. బంతిపూలకు అధిక నీటి అవసరం ఉండదు. మొక్కలు నాటిన తర్వాత నేల తడి ఉండేలా నీరు పెట్టాలి.
నీటిపారుదల, ఎరువులు: మొగ్గలు వచ్చే వరకు వారానికి రెండు సార్లు నీరు పోయడం సరిపోతుంది. పువ్వులు పూసే దశలో మాత్రం రోజూ నీరు అవసరం అవుతుంది. పంట నాణ్యతను మెరుగుపరచడానికి సేంద్రియ ఎరువులు వాడటం మంచిది. అదనంగా యూరియా, డీఎపీ, పొటాష్ సరైన మోతాదులో వేయడం వల్ల పూల దిగుబడి పెరుగుతుంది. పూత సమయంలో ఫోలియర్ స్ప్రే చేయడం వలన పువ్వుల రంగు, పరిమాణం మెరుగవుతాయి.
అంతర పంటలు: బంతిపూల తోటలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, ముల్లంగి, క్యారెట్ వంటి కూరగాయలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఇవి అదనపు ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా నేల సారాన్ని కూడా కాపాడుతాయి. అందువల్ల కొత్తగా వ్యవసాయం లేదా బిజినెస్ ప్లాన్ చేసే వారు ఈ విధానాన్ని అనుసరిస్తే, అధిక లాభాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ఖాళీ సీసాలతో లక్షల ఆదాయం.. రీసైక్లింగ్‌తో నెలకు రూ.2 లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియా!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS