Glass Bottle Recycling Business: ఇప్పుడు యువత ఉద్యోగం కన్నా వ్యాపారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. చదువు పూర్తికాగానే వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారికి చక్కటి అవకాశంగా నిలిచే వ్యాపార ఐడియా ఇది.. ఖాళీ గ్లాస్ సీసాలను సేకరించి క్రిస్టల్స్ తయారీ వ్యాపారం.
ఖాళీ సీసాలతో కాసుల వర్షం
ప్రస్తుతం భారతదేశంలో రోజుకు సగటున కోటిన్నర గ్లాస్ బాటిల్స్ వృథా అవుతున్నాయి. ఆల్కహాల్, కూల్‌డ్రింక్స్ వంటి వాటి ఖాళీ సీసాలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. ఈ వృథాను సరైన రీతిలో వినియోగించి, రీసైక్లింగ్ ద్వారా గ్లాస్ క్రిస్టల్స్‌గా మార్చితే లక్షల్లో ఆదాయం పొందవచ్చు.
వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి ముఖ్యంగా అవసరమయ్యే యంత్రం – గ్లాస్ బాటిల్ పౌడరింగ్ మిషన్. దీని ధర మార్కెట్లో రూ.50,000 నుంచి రూ.2,00,000 వరకు ఉంటుంది. స్టార్టప్ దశలో ఉంటే రూ.75,000–1,00,000 మధ్య మిషన్ తీసుకోవచ్చు. బాటిల్స్‌ను సేకరించేందుకు స్క్రాప్ డీలర్లు, స్థానిక వైన్ షాప్స్, బార్లతో ఒప్పందాలు చేసుకోవచ్చు. రోజుకు కనీసం 300–400 బాటిల్స్ సేకరించగలిగితే ఉత్పత్తి కొనసాగుతుంది.
బాటిల్స్ నుంచి క్రిస్టల్స్ తయారీ
సేకరించిన గ్లాస్ బాటిల్స్‌ను ముందుగా శుభ్రంగా కడిగి యంత్రంలో వేసి గాజు ముక్కలుగా మార్చాలి. ఇవే గ్లాస్ క్రిస్టల్స్. ఇవి నిర్మాణ రంగం, గాజు తయారీ, డెకరేటివ్ ఐటెమ్‌ల కంపెనీలకు అవసరమయ్యే ముఖ్యమైన ముడిపదార్థం. డిమాండ్ ఉన్న చోట సరఫరా చేస్తూ స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.
పెట్టుబడి, లాభాలు, మార్కెట్
ఈ వ్యాపారం కోసం ప్రాథమిక పెట్టుబడి రూ.1.5 లక్షల లోపే ఉంటుందంటే, చాలా చౌకగా ప్రారంభించవచ్చు. ఒక్క టన్ను గ్లాస్ క్రిస్టల్స్ తయారీకి సగటున రూ.3,000 ఖర్చవుతుంది. అదే టన్ను మార్కెట్లో రూ.8,000కి అమ్మవచ్చు. అంటే టన్నుకి రూ.5,000 లాభం. నెలకు 20 టన్నులు అమ్మగలిగితే రూ.1 లక్ష ఆదాయం రావచ్చు. అవసరమైతే ఉత్పత్తిని పెంచి ఆదాయాన్ని రెండు లక్షల దాకా పెంచుకోవచ్చు. గ్లాస్ పునర్వినియోగానికి గల అవసరం పెరుగుతోందని పరిశ్రమల సంఖ్యనూ, మార్కెట్ విస్తరణ అవకాశాలనూ బట్టి ఇది ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం అని నిరూపణ అవుతుంది.
Also Read: లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇది చేస్తే… ధనవంతుడు కావడం గ్యారంటీ!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS