India-UAE Strategic Deal: సౌదీ-పాకిస్తాన్‌ రక్షణ ఒప్పందం తర్వాత భారత్-యుఏఈ కీలక ఒప్పందం!

India-UAE Strategic Deal: పాకిస్తాన్‌-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం మధ్యప్రాచ్యం నుంచి ఆసియా అంతటా ప్రభావం చూపుతుండగా, భారతదేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌తో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. 

India-UAE Strategic Deal
India-UAE Strategic Deal

సెప్టెంబర్‌ 18, గురువారం రోజున భారత వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌, యుఏఈ విదేశాంగ మంత్రితో ఈ అంశంపై కీలక చర్చలు జరిపారు.

యుఏఈ ప్రాధాన్యం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్యప్రాచ్యంలో అత్యంత ప్రభావవంతమైన దేశం. ఇజ్రాయెల్‌తో కుదిరిన అబ్రహాం ఒప్పందంలో భాగస్వామిగా ఉంది. ఇటీవల ఖతార్‌పై ఇజ్రాయెల్‌ దాడికి సంబంధించి దోహాలో జరిగిన సమావేశానికి యుఏఈ పెద్ద నాయకులు హాజరుకాలేదు. ప్రపంచ దేశాలతో వ్యూహాత్మక దౌత్యాన్ని కొనసాగిస్తున్న యుఏఈ, ఈ క్రమంలో పీయూష్‌ గోయల్‌తో జరిగిన భేటీ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

పాకిస్తాన్‌-సౌదీ ఒప్పందం ఏమిటి?

గత గురువారం పాకిస్తాన్‌ ప్రధాని షెహ్‌బాజ్‌ షరీఫ్‌, సౌదీ క్రౌన్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఒక ప్రధాన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇందులో భాగంగా, రెండు దేశాల్లో ఏదైనా ఒకదానిపై దాడి జరగితే, దానిని ఇరుదేశాలపై దాడిగా పరిగణిస్తారని స్పష్టం చేశారు. ఖతార్‌పై ఇజ్రాయెల్‌ దాడి తర్వాత ఈ ఒప్పందం మరింత అత్యవసరమైంది. పాకిస్తాన్‌ సౌదీకి అణు రక్షణ కవచం అందిస్తే, ప్రతిగా సౌదీ అరేబియా పాకిస్తాన్‌లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, ఇంధన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. ముఖ్యంగా పాకిస్తాన్‌ రైల్వే రంగాన్ని అభివృద్ధి చేయడంలో సౌదీ పెట్టుబడులు కీలకం కానున్నాయి.

Saudi-Pakistan Defense Deal
Saudi-Pakistan Defense Deal

ఇక ఈ ఒప్పందంలో భారత్‌ ప్రాధాన్యత కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పాకిస్తాన్‌-భారత్‌ మధ్య శత్రుత్వం ఎప్పటికీ తగ్గలేదు. ప్రాక్సీ దాడుల ద్వారా పాకిస్తాన్‌ తరచూ భారత్‌ను ఉద్దేశించి చర్యలు చేపడుతుంటే, భారత్‌ కూడా ప్రతీకార చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు సౌదీ అరేబియా ఇలాంటి ఘటనలపై తటస్థ ధోరణి పాటించింది.

భారత్‌-యుఏఈ ఒప్పందం ఏమిటి?

భారత్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఇప్పుడు అంతరిక్ష, సముద్ర రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. ఇంతకుముందు నుంచే ఇరు దేశాలు శక్తి, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యం కొనసాగిస్తున్నాయి. ఈ కొత్త ఒప్పందం సంబంధాలను మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో అంతరిక్ష ప్రాజెక్టులను అమలు చేసిన తొలి దేశం యుఏఈ. 100కిపైగా అంతరిక్ష ప్రాజెక్టులను నడుపుతున్న ఈ దేశం, ఇప్పటికే మార్స్‌ మిషన్‌పై కూడా పని చేస్తోంది. అంతేకాదు, దుబాయ్‌లోని జెబెల్‌ అలీ పోర్ట్‌ అరబ్‌ ప్రపంచంలోనే అతి పెద్ద నౌకాశ్రయం. పర్షియన్‌ గల్ఫ్‌తో వాణిజ్యంలో యుఏఈ కీలక పాత్ర పోషిస్తోంది.


Post a Comment (0)
Previous Post Next Post