ECI Rejects Rahul Gandhi Claims: ఓట్లను తొలగించడం అసాధ్యం.. రాహుల్ ఆరోపణలకు ఈసీ సమాధానం!

ECI Rejects Rahul Gandhi Claims: ఓట్ల దొంగతనం ఆరోపణ వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసింది అని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, రాహుల్‌ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అవి పూర్తిగా అర్థరహితమని కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఖండించింది.

ECI Rejects Rahul Gandhi Claims
ECI Rejects Rahul Gandhi Claims

కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్‌ గాంధీ ఆరోపణలను సీరియస్‌గా తేల్చి, అవాస్తవమని, సోషల్ మీడియాలో కూడా స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో ఓట్లను తొలగించడం అసాధ్యమని ఈసీ వెల్లడించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని అలంద్‌లో ఓట్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు సమాచారం ఉంది, మరియు దీనిపై ఈసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అలంద్‌ సీటులో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ విజయం సాధించిందని ఈసీ పేర్కొంది.

Also Read: సౌదీ-పాకిస్తాన్‌ వ్యూహాత్మక బంధం.. భారత్‌కు ముప్పా?

రాహుల్ కేంద్ర ఎన్నికల సంఘంపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించబడిందని, సెంట్రలైజ్డ్‌ వ్యవస్థ ద్వారా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ చోరీ జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. ఈ చర్యలను సీఈసీ జ్ఞానేష్‌ కుమార్ కాపాడుతున్నారని కూడా చెప్పారు.

ఓట్ల చోరీ కేంద్రీకృతంగా జరుగుతోందని రాహుల్‌గాంధీ వివరించారు. మహారాష్ట్ర రాజురాలో 6,851 ఫేక్‌ ఓట్లు చేర్చబడ్డాయని, కర్ణాటక అలంద్‌లో గోదాబాయ్‌ పేరుతో 18 ఓట్లు తొలగించబడ్డాయని తెలిపారు. నకిలీ లాగిన్‌ ఐడీలతో కాంగ్రెస్‌ మద్దతుదారుల ఓట్లు తొలగించబడ్డాయని, వివిధ రాష్ట్రాల ఫోన్ నంబర్లను ఉపయోగించారని పేర్కొన్నారు. కర్ణాటక సీఐడి 18 సార్లు అడిగినా ఈసీ వివరాలు ఇవ్వలేదని విమర్శించారు. వారంలోగా ఈ ఆధారాలను ఇవ్వమని డిమాండ్ చేశారు.

రాహుల్ ఆరోపణలను బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. "హైడ్రోజన్‌ బాంబుతో ధమాఖా పేలుస్తానన్న రాహుల్‌గాంధీ డ్రామా ఆడి వెళ్లిపోయారు" అని బీజేపీ నేత అనురాగ్‌ ఠాకూర్ విమర్శించారు. రాహుల్‌ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచే కుట్రలో నిమగ్నమయ్యారని, అందుకే ఈసీ వంటి రాజ్యాంగబద్ద సంస్థలపై తరచూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే కోర్టులో సమర్పించాలని సూచించారు.

Also Read: సౌదీ-పాకిస్తాన్‌ రక్షణ ఒప్పందం తర్వాత భారత్-యుఏఈ కీలక ఒప్పందం!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post