Operation Numkhor: కేరళలో సినీ తారల ఇళ్లపై కస్టమ్స్ అధికారులు దాడులు చేపట్టారు. వాహనాల అక్రమ దిగుమతి కేసులలో దేశవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీలు, సోదాల భాగంగా మలయాళ సినిమా పరిశ్రమలోని స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ హీరోలు భూటాన్ నుంచి విలాసవంతమైన వాహనాలను దిగుమతి చేసుకున్నారని, టాక్స్ నిబంధనలకు వ్యతిరేకంగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, సినీ తారలు, ఇతర ప్రముఖుల నివాసాలపై కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
![]() |
Custom raids on Prithviraj, Dulquer Salmaan |
వివరాల ప్రకారం.. హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా భూటాన్ నుంచి విలాసవంతమైన, అత్యంత ఖరీదైన వాహనాలను అక్రమ మార్గంలో కొనుగోలు చేస్తున్నారనే సమాచారం అందింది. ఈ నేపథ్యంలో “నుమ్కూర్” ఆపరేషన్ పేరుతో భారతీయ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ కేరళలో పృథ్వీరాజ్, దుల్కర్ నివాసాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడులు దేశవ్యాప్తంగా చాలా మందిని ఆకర్షించాయి.
సంపన్న వర్గాలు వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకొని ట్యాక్స్ ఎగవేతకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టబడింది. కోచిలోని పనమ్‌పిల్లి నగర్‌లోని దుల్కర్ సల్మాన్ నివాసం, థేవరలోని పృథ్వీరాజ్ ఇంటి నివాసం, తిరువనంతపురంలోని మరొక నివాసంపై దాడులు జరగగా, అక్కడ ఎలాంటి వాహనాలు లభించలేదని సమాచారం అందింది. అంతేకాక, కోచి, కోజికోడ్, మలప్పురం సహా కేరళలోని 30 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. కొద్దిగా సమాచారం ప్రకారం, దుల్కర్ సల్మాన్ నుంచి ఒక వాహనాన్ని సీజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి; అధికారిక ధృవీకరణ ఇంకా ఎదురుచూస్తోంది.
“ఆపరేషన్ నుమ్కూర్” విషయానికి వస్తే.. భూటాన్ ఆర్మీ తొలగించిన వాహనాలను తక్కువ రేటు వద్ద కొందరు కొనుగోలు చేస్తున్నారు. ఈ వాహనాలను ఎలాంటి కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా భారత్‌లోకి తరలించి స్మగ్లింగ్ చేస్తున్నట్లు దర్యాప్తు వెల్లడించింది. తాత్కాలిక అడ్రస్‌తో వాహనాలను రిజిస్టర్ చేసి హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాహనాలను సినీ తారలు, వ్యాపారవేత్తలు, సంపన్న వర్గాలు కొనుగోలు చేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.