Ganesh Laddu Auction:హైదరాబాద్ గణపతి లడ్డూ వేలంలో రికార్డు.. 2.32 కోట్లు పలికిన లడ్డూ!

Hyderabad Ganesh Laddu Auction: వినాయక చవితి వేడుకలు అనగానే దేశవ్యాప్తంగా ముందుగా గుర్తుకు వచ్చేది ముంబై కాగా, దానికి సమానంగా అందరి దృష్టిని ఆకర్షించేది మన హైదరాబాద్‌ నగరమే. ముఖ్యంగా ఖైరతాబాద్ భారీ గణపతి విగ్రహం, బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణలు. 

Hyderabad Ganesh Laddu Auction
Hyderabad Ganesh Laddu Auction

తెలుగు రాష్ట్రాల్లో గణేశుడి జాతర అంటే ఖైరతాబాద్ గణపతి, లడ్డూ వేలం అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుకొచ్చే స్థాయికి చేరాయి. బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటలో రికార్డు ధర పలకడం దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. అయితే ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా లడ్డూ వేలం పాటలు భక్తులను, ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌లో జరిగిన లడ్డూ వేలంపాట కొత్త చరిత్ర సృష్టించింది.

హైదరాబాద్‌లో గణపతి లడ్డూ వేలంలో ఇదే తొలిసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. రాజేంద్రనగర్ సన్‌సిటీలోని రిచ్‌మండ్ విల్లాస్ వద్ద నిర్వహించిన గణనాధుడి లడ్డూ వేలంలో ఏకంగా రూ.2.32 కోట్లు దక్కింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ వేదికగా జరిగిన ఈ వేలంలో గణపతి లడ్డూ అంత భారీ ధరకు అమ్ముడవడం విశేషం. శుక్రవారం జరిగిన ఈ వేలంపాట గత ఏడాది రికార్డును బద్దలు కొడుతూ కొత్త చరిత్ర సృష్టించింది. ప్రతి సంవత్సరం విశేష ఆకర్షణగా నిలిచే ఈ వేలానికి స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల వారూ అధికంగా హాజరవుతుంటారు. ఈసారి వేలాన్ని రూ.1 కోటి నుంచి ప్రారంభించినట్టు సమాచారం. గత సంవత్సరం ఇదే కమ్యూనిటీలో గణపతి లడ్డూ రూ.1.87 కోట్లు పలికింది.

Also Read: జాన్వీ కపూర్ ఆరోగ్యంపై రూమర్స్..పెద్ది షూటింగ్ ఆగిపోతుందా?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post