AP NMMS Online Application 2025: 8వ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ వరకు NMMS స్కాలర్‌షిప్‌తో ఏడాదికి రూ.12 వేల సాయం!

AP NMMS Online Application 2025: కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ (NMMS) పథకం కింద ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అదే క్రమంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పేద విద్యార్థులు స్కాలర్‌షిప్ పొందే అవకాశం కలుగుతుంది. 8వ తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయకుండా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ ప్రకటనను ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్‌ (AP Board of Secondary Education) విడుదల చేసింది.

AP NMMS Online Application 2025
AP NMMS Online Application 2025

అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30, 2025 లోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. NMMS పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఉపకారవేతనం లభిస్తుంది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా మొత్తం 1 లక్ష మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ మంజూరు చేస్తారు. అందులో 4,087 స్కాలర్‌షిప్‌లు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.

అర్హతలు:

  • ప్రభుత్వ, మున్సిపల్, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ లేదా మోడల్ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి రెగ్యులర్‌గా 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
  • 7వ తరగతిలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. (SC, ST విద్యార్థులకు రాయితీ వర్తిస్తుంది).
  • తుది ఎంపిక సమయానికి 8వ తరగతిలో కూడా కనీసం 55% మార్కులు సాధించాలి.
  • విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3,50,000 మించకూడదు.
  • ఎంపిక పరీక్షలో ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం విద్యార్థులను ఎంపిక చేస్తారు.
  • ఎంపికైన వారికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రతి సంవత్సరం రూ.12,000 చొప్పున ఉపకారవేతనం అందుతుంది.

దరఖాస్తు విధానం:

విద్యార్థుల దరఖాస్తులు ఆయా పాఠశాలల ద్వారా మాత్రమే AP Secondary Education Board వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌గా సమర్పించాలి. తరువాత ప్రింటౌట్‌తో పాటు అవసరమైన ధ్రువపత్రాలను డీఈవో కార్యాలయానికి అందజేయాలి.

  • బీసీ, ఓసీ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.100/-
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ.50/-
  • ఆధార్ కార్డులో ఉన్న వివరాల ప్రకారమే దరఖాస్తులో నమోదు చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 4, 2025
  • ఫీజు చెల్లింపు ప్రారంభం: సెప్టెంబర్ 10, 2025
  • దరఖాస్తుల చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2025
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ: అక్టోబర్ 10, 2025
  • డీఈవోకు దరఖాస్తు పత్రాల సమర్పణ చివరి తేదీ: అక్టోబర్ 15, 2025
  • డీఈవో లాగిన్‌లో దరఖాస్తు ఆమోదం చివరి తేదీ: అక్టోబర్ 20, 2025
  • రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 7, 2025

Post a Comment (0)
Previous Post Next Post