Matangeshwar Temple Mystery: ఖజురహో ఆలయంలోని శివలింగం కింద దాగి ఉన్న రహస్యం తెలుసా?

Matangeshwar Temple Mystery: మన దేశంలోని అనేక ఆలయాలు తమ ప్రత్యేకతతో పాటు ఎన్నో రహస్యాలను దాచుకున్నవిగా గుర్తింపు పొందాయి. ఆధునిక శాస్త్రవేత్తలు ఎంతగా ప్రయత్నించినా, కొన్ని ఆలయాల్లో దాగి ఉన్న మిస్టరీలను ఇంకా ఛేదించలేకపోతున్నారు. అలాంటి అపార ఆధ్యాత్మికతను, అజ్ఞాతాలను కలిగి ఉన్న ప్రముఖ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖజురాహోలో ఉన్న మాతంగేశ్వర్ లేదా మృత్యుంజయ మహాదేవ ఆలయం.

Matangeshwar Temple Mystery - Khajuraho

ఖజురహో అనే పేరు వింటే కళాత్మక శిల్పసంపద కళ్ల ముందు నిలుస్తుంది. అయితే అదే స్థలంలో ఉన్న మాతంగేశ్వర్ ఆలయం మరో రకమైన రహస్యాన్ని దాచుకుంది. ఈ ఆలయంలోని శివలింగం కింద 18 అడుగుల లోతులో విలువైన నిధి దాగి ఉందని భావిస్తున్నారు. ఆ నిధిని రుషులు లేదా దైవిక శక్తులు కాపలాకాస్తున్నాయని స్థానిక ప్రజల నమ్మకం.

ఇక ఈ ఆలయానికి సంబంధించి మరొక విశేషం ఏమిటంటే... ఇక్కడ ప్రతిష్టించిన శివలింగం ప్రతి ఏటా కొద్దిగా పెరుగుతూ ఉంటుందట. దీనికి గల కారణం ఇప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. కొంతమంది ఇది దైవిక సంఘటన అంటే, మరికొందరు భౌగోళిక కారణాలే అని అభిప్రాయపడుతున్నారు.

Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?

పశ్చిమ ఖజురహో దేవాలయాల సమూహానికి సమీపంలో ఉన్న ఈ మాతంగేశ్వర్ మహాదేవ ఆలయం, ఇతర దేవాలయాల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని 9-10వ శతాబ్దాల్లో చందేలా పాలకులు నగారా శైలిలో నిర్మించారు. నిత్యం ఈ ఆలయంలో భక్తుల రద్దీ కనిపించడమే కాక, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం భక్తుల మనసులకు శాంతిని అందిస్తుందని అంటారు.

Matangeshwar Temple Mystery
Matangeshwar Temple Mystery

ప్రస్తుతం ఈ శివలింగం సుమారు 9 అడుగుల ఎత్తులో ఉంది. ఒక విశ్వాసం ప్రకారం ఇది 18 అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు యుగాంతం సంభవిస్తుందని చెబుతారు. ఇదే శివలింగం కింద విలువైన నిధి దాగి ఉందన్న వాదనలున్నా, దానికి పునాది వేయగలిగే పక్కా ఆధారాలు మాత్రం లేవు. తరం నుండి తరం వరకు ప్రజలు ఈ నమ్మకాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.

ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో ఈ ఆలయంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి. శివకళ్యాణం విశేషంగా జరుగుతుంది. ఈ వేడుకలకు సుమారు 25,000కి పైగా భక్తులు హాజరవుతారు. శివలింగానికి అభిషేకం చేసి, వరుడిలా అలంకరించటం, వేడుకలు దాదాపు 10 రోజులపాటు సాగుతాయి. దేశం నలుమూలల నుండి భక్తులు తరలివచ్చి, హస్తకళలు, గ్రామీణ సర్కస్ ప్రదర్శనలు, సంగీత, జానపద నాటకాలను ఆస్వాదిస్తారు.ఈ ఆలయానికి సమీపంలో లక్ష్మణ దేవాలయం, వరాహ మందిరం, పార్వతీ ఆలయం, లక్ష్మీ మందిరం, ప్రతాపేశ్వర్ ఆలయం, పురావస్తు మ్యూజియం, విశ్వనాథ ఆలయం వంటి ఎంతో ప్రాముఖ్యమున్న దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి.

Also Read: శ్రీకృష్ణుడి గుండె ఇప్పటికీ ఇక్కడ కొట్టుకుంటుంది!

మరిన్ని Interesting Facts కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post