Manju Warrier: దక్షిణాదిలో ప్రముఖ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరు. ఆమె ఆస్తుల విలువ రూ.142 కోట్లకు చేరింది. తాజాగా రూ.21 లక్షల విలువైన బైక్‌ను సొంతం చేసుకుని తన అభిమానులను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, ఆమెకి బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టమట. ప్రస్తుతం టాప్ హీరోల సరసన నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. మరి ఆమె ఎవరో తెలుసా?
![]() |
Manju Warrier 21 lakh luxury bike |
సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, బిజినెస్ వెంచర్ల ద్వారా పెద్ద మొత్తంలో సంపాదన చేస్తోంది. ఒక్కో చిత్రానికి ఆమె రూ.50 లక్షల నుండి రూ.1 కోటి వరకు వసూలు చేస్తుందని సమాచారం.
Also Read: ప్రేమించి పెళ్లిచేసుకున్న సెలబ్రిటీలు… కానీ ఎందుకు విడిపోతున్నారు?
మలయాళ సినిమాలతో పాటు తమిళ చిత్రాల్లో కూడా ఆమె మెరిసింది. ధనుష్‌తో అసురన్, అజిత్ కుమార్‌తో తునైవు వంటి సినిమాల్లో నటించి అభిమానులను అలరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో ఆమెకు విశేషమైన ఫాలోయింగ్ ఉంది.
![]() |
Manju Warrier |
ప్రతి బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు ఆమె దాదాపు రూ.75 లక్షలు అందుకుంటుందని సమాచారం. బైకులంటే మంజు వారియర్‌కి ప్రత్యేకమైన ఇష్టం. వేర్వేరు మోడళ్ల బైకులను సేకరించడం ఆమెకు హాబీ. తాజాగా ఆమె రూ.21 లక్షల విలువైన BMW R 1250 GS మోడల్ బైక్ కొనుగోలు చేసింది.
మలయాళ సినిమాల్లో విభిన్న పాత్రలకు ప్రాణం పోసిన మంజు, ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వరుసగా ఫోటోలు, పోస్టులు షేర్ చేస్తోంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు అభిమానులను బాగా ఆకర్షిస్తున్నాయి.
Also Read: చదువులో ఫెయిల్.. . కానీ స్టార్ హీరోయిన్‌గా పాపులర్ అయింది!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS