El Nino and La Nina: ఈ ఏడాది వర్షాలు గణనీయంగా కురుస్తున్నాయని చెప్పొచ్చు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఇప్పటికే సగటు వర్షపాతం 75% నమోదు అయింది. ఇకపై కూడా మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు సూచిస్తున్నారు. గత సంవత్సరం కూడా భారీ వర్షాలు కురిశాయి. అయితే 1999 నుంచి 2003 వరకు తక్కువ వర్షపాతం నమోదై, వరుసగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత 2004 నుండి వరుసగా అధిక వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? కొన్నేళ్లపాటు వర్షాభావం ఉండి, మరికొన్ని సంవత్సరాలపాటు భారీ వర్షాలు పడటానికి కారణం ఏమిటి?
![]() |
El Nino and La Nina - Causes and Effects |
![]() |
El Nino and La Nina |
ఈ విధంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఎక్కడో అధిక వర్షాలు, ఎక్కడో వర్షాభావం కనిపిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాతం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ ప్రభావం కూడా కనిపిస్తోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బర్స్ట్ కారణంగా ఒక్కసారిగా వరదలు రావడంతో ఇళ్లు కొట్టుకుపోయాయి, పలువురు గల్లంతయ్యారు.
ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే పట్టణాలు, నగరాల్లో వర్షం అధికంగా ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితి తప్ప బయటకు వెళ్లకపోవడమే మంచిది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో వర్షం సమయంలో బయటకు వెళ్తే ట్రాఫిక్‌లో ఇరుక్కోవడం, రహదారుల్లో గుంతల కారణంగా ప్రమాదాలు జరగే అవకాశం ఉంటుంది.
Also Read: కైలాస పర్వతంపై నిజంగా శివుడు ఉన్నాడా?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS