Delhi High Court Judgment on Adultery: మన దేశ వివాహ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మన సంస్కృతి, సంప్రదాయాలు ఎంతగానో గొప్పవిగా నిలిచాయి. అందుకే అనేక దేశాలు మన వివాహ పద్ధతులను ఆదరిస్తూ, ఆచరిస్తూ, అనుసరిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇతర దేశాల వారు కూడా భారతదేశానికి వచ్చి ఇక్కడి సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకుంటున్నారు. నిజానికి మన వివాహ వ్యవస్థలో కట్టుబాట్లు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల దంపతుల మధ్య నమ్మకం పెరుగుతుంది, ప్రేమ బలపడుతుంది, ఒకరికి ఒకరు అండగా నిలిచి జీవితాన్ని గడపాలనే కోరిక మరింత దృఢమవుతుంది.
![]() |
Delhi High Court Judgment on Adultery |
దాంపత్య జీవితం సజావుగా సాగుతున్నంతవరకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ దంపతుల మధ్య మూడో వ్యక్తి ప్రవేశిస్తే సంసారంలో చీలికలు రావడం సహజం. ఇవి క్రమంగా వివాహేతర సంబంధాలకు దారి తీస్తాయి. గతంలో ఇటువంటి సంబంధాలను నేరాలుగా పరిగణించేవారు. అయితే, ఇది నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇటీవల ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఈ అంశంపై కొత్త చర్చలకు దారితీసింది.
వివాహేతర సంబంధాలు నేరపూరితమైనవి కాకపోవచ్చుగానీ, అవి దాంపత్య బంధంలో నమ్మకాన్ని ధ్వంసం చేస్తాయి. భార్యాభర్తల మధ్య భావోద్వేగాలను దెబ్బతీస్తాయి. ఒక భాగస్వామి మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వల్ల రెండో వ్యక్తి జీవితంలో తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. నమ్మకం కోల్పోయిన తర్వాత సంసారంలో అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటాయి, కొన్ని సందర్భాల్లో అవి దారుణాలకు దారి తీస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మూడో వ్యక్తిపై సివిల్ కేసు వేసే అవకాశం ఉందని, నష్టపరిహారం కూడా డిమాండ్ చేయవచ్చని హైకోర్టు జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్ పేర్కొన్నారు.
Also Read: అమెరికాలో H-1B వీసా ఫీజు $1 లక్షకు పెంపు.. గందరగోళంలో భారతీయులు!
2018లో దేశ సుప్రీంకోర్టులో జోసెఫ్ షైన్ కేసు విచారణకు వచ్చింది. ఇది వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసు. ఈ కేసును సుప్రీంకోర్టు డీక్రిమినలైజ్ చేసింది. నేర పరిధి నుంచి తొలగించినా, ఇది సరికొత్త చర్చలకు దారితీసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఒక భాగస్వామి వివాహేతర సంబంధం పెట్టుకున్నప్పుడు, ఆ సంబంధానికి ప్రేరేపించిన మూడో వ్యక్తిపై సివిల్ చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పు భారతదేశంలో Alienation of Affection అనే సూత్రాన్ని పరీక్షించేందుకు దారి తీస్తోంది.
ఢిల్లీ హైకోర్టులో మరో కేసు కూడా విచారణకు వచ్చింది. 2012లో ఒక మహిళ వివాహం చేసుకుంది. అయితే 2021లో భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడం వల్ల వారి వైవాహిక జీవితం దెబ్బతిందని ఆమె ఆరోపించింది. ఆ మహిళ తన భర్తతో సన్నిహితంగా ఉంటూ, విహారయాత్రలకు కూడా వెళ్తోందని ఫిర్యాదులో పేర్కొంది. చివరికి తన భర్త నుంచి విడిపోయి విడాకులు కోసం దరఖాస్తు చేసిందని తెలిపింది. తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసిన ఆ మహిళపై కేసు కూడా వేసింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆమె ఫిర్యాదును సివిల్ సూట్‌గా స్వీకరించింది. అడల్టరీ తీవ్రమైన నేరం కాకపోయినా, అది సివిల్ చట్టాల పరిధిలోకి వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
భారతదేశంలో Alienation of Affection అనే విధానం స్పష్టంగా లేకపోయినా, ఢిల్లీ హైకోర్టు దీనిని సివిల్ చర్యగా పరిగణించడం విశేషం. సంసారం నాశనం చేయడానికి కారణమైన మూడో వ్యక్తి నుంచి నష్టపరిహారం కూడా పొందవచ్చని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా అంగీకరిస్తే, వివాహేతర సంబంధాల విషయంలో ఇకపై మరింత జాగ్రత్త అవసరం అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read: భారత్‌పై ఆధారపడే దేశాలు ఇవే! నేపాల్ నుంచి ఖతర్ వరకు భారత్ సహాయం
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS