Tirupati Parakamani theft: దుమారం రేపుతున్న శ్రీవారి పరకామణి వ్యవహారం.. సిట్ విచారణకు ఆదేశాలు, కేంద్రం జోక్యం కోసం ప్రయత్నాలు!

Tirupati Parakamani theft: తిరుమల పరకామణి వ్యవహారం ఏపీ ప్రభుత్వం దృష్టిలో సీరియస్‌గా ఉంది. గత ప్రభుత్వ వ్యవహారాల్లో చోటుచేసుకున్న ఈ చోరీపై సిట్‌ విచారణకు ఆదేశిస్తామని మంత్రి నారాలోకేష్‌ స్పష్టం చేశారు. పరకామణి దొంగను అరెస్ట్ చేయకుండా గతంలో 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి పంపించారని ఆయన ఆరోపించారు. పరకామణి చోరీ కేసులో వాస్తవాలు బయటకు రావాలని చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై లోకేష్‌ స్పష్టం చేశారు. “దేవుడిని కూడా వదలని దొంగలు తప్పించుకోలేరని.. సిట్‌ విచారణకు ఆదేశించి ఈ వ్యవహారంలో నిజాలను తేలుస్తాం” అని మంత్రి తెలిపారు. జగన్‌ అండ్‌ టీం దేవుడి దగ్గర నాటకాలు ఆడారని, అందుకే దేవుడు చేయాల్సినది చేశాడని ఆయన వ్యాఖ్యానించారు.

Tirupati Parakamani theft
Tirupati Parakamani theft

శ్రీవారి సొమ్మును దోచిన వ్యక్తిపై చట్టప్రకారం చర్యలు తీసుకోకుండా రాజీ కుదుర్చడం ఏంటని అధికార కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. రవికుమార్‌ వెనుక గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. సిట్‌ విచారణ ద్వారా వారి పాలనలో ఉన్న బండారాన్ని బయటపెడతామని తెలిపారు. మరోవైపు వైసీపీ నేతలు పరకామణి చోరీని బయటపెట్టి, రవికుమార్‌ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామని ప్రకటించారు. 20 ఏళ్లుగా రవికుమార్‌ పరకామణిలో చోరీ చేస్తున్నాడని, అప్పట్లో చంద్రబాబు ఆ పరిస్థితిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై దమ్ముంటే సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలకు సంబంధించిన అంశంలో కేంద్రం జోక్యం కోరుతోంది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసి పరకామణి వివాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. పరకామణి కేసు రాజకీయంగా ప్రేరేపించబడినట్టు ఉందని, తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని వైసీపీ ఎంపీ లేఖలో పేర్కొన్నారు. విశ్వసనీయమైన ఆధారాలతో దర్యాప్తు జరగాలన్న అభిప్రాయాన్ని కూడా తెలిపారు.

అలాగే, తిరుమల పరకామణి వివాదంపై తక్షణ జోక్యం తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా లేఖ రాశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. 120 కోట్ల హిందువుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న తిరుమల క్షేత్రం పవిత్రతను కాపాడడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. మరి ఈ వ్యవహారంపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను  సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post