Deepika Padukone: కల్కి సీక్వెల్‌లో దీపికా స్థానాన్ని ఎవరూ భర్తీ చేస్తున్నారు?

Deepika Padukone: ఈ మధ్యకాలంలో అగ్రతార దీపికా పదుకొణెకు తెలుగు దర్శకులు షాకులు మీద షాకులు ఇస్తున్నారు. ఇటీవల స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీపికపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రభాస్ కాంబోలో రూపొందుతోన్న ‘స్పిరిట్’ సినిమాలో దీపికను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఆమె ఈ సినిమాకు దూరమయ్యింది. దీని స్థానంలో తృప్తి దిమ్రీ కథానాయికగా ఎంపికయ్యారు. ఒక బిడ్డకు తల్లి అయిన దీపిక రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానని, అదనంగా ఎక్కువ పారితోషికం అడగడంతో, సందీప్ రెడ్డి వంగా ఆమెను తప్పించారని సమాచారం.

Who is replacing Deepika Padukone in the Kalki sequel
Who is replacing Deepika Padukone in the Kalki sequel

అదేవిధంగా, ‘స్పిరిట్’ మూవీ స్టోరీని దీపికా పీఆర్ టీమ్ లీక్ చేసిందన్న వార్తలపై కూడా దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది.

ఇక ఇప్పుడు ‘కల్కి’ సీక్వెల్ నుంచి కూడా దీపికా పదకొణెను తొలగించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో దీపికా కీలక పాత్ర పోషించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఆమె సీక్వెల్‌లో కనిపించదని వెల్లడైంది. రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తానంటూ చేసిన కమిట్మెంట్స్ తన సినిమాకు సెట్ కానందున మేకర్స్ దీపికను తొలగించారని అఫీషియల్‌గా తెలిపారు.

Deepika Padukone
Deepika Padukone

దీపికా స్థానంలో ఎవరు నటిస్తారనే ఆసక్తి సోషల్ మీడియాలో పెరుగుతోంది. కొందరు పూజా హెగ్డే నటిస్తారని చెబుతున్నారు, మరికొందరు అనుష్క శెట్టి అని అంటున్నారు. కాగా, కొందరు మాత్రం ‘కల్కి’ సినిమాలో దీపికా పదకొణె పాత్రను మొదటి పార్ట్‌తోనే ముగిస్తారని, మరో హీరోయిన్ చేర్చబడదని వ్యాఖ్యలు చేస్తున్నారు. త్వరలో దీనిపై క్లారిటీ రానుందని అంచనా.

ఇక నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో దీపికాకు కౌంటర్ ఇచ్చారు. ‘కల్కి 2898 AD’ చిత్రంలోని కృష్ణుడి ఎంట్రీ సీన్‌ను షేర్ చేస్తూ, “కర్మను ఎవరూ తప్పించుకోలేరు. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే” అని డైలాగ్ పెట్టారు. దీని తరువాత దీపికా పై ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. 

Also Read: 'కల్కి 2898 AD' సీక్వెల్‌ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post