Turmeric Bath Benefits: చాలా మంది ప్రతిరోజూ స్నానానికి ఉపయోగించే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తుంటారు. పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా జ్యోతిష్యశాస్త్రంలో పసుపుకు ప్రత్యేక ప్రాముఖ్యత కూడా ఉంది.
![]() |
Turmeric Bath |
ముఖ్యంగా స్నానం చేసే నీళ్లలో పసుపు కలిపి స్నానం చేయడం వలన, జీవితంలోని అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడుతుందని నమ్మకం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, పసుపు శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగించే మరియు శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. స్నానం చేసే నీళ్లలో పసుపు కలపడం వల్ల అదృష్టం అనుకూలంగా మారుతుందని భావిస్తారు.
అలాగే, పసుపు బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పసుపుతో స్నానం చేయడం వల్ల జాతకంలో బృహస్పతి గ్రహ ప్రభావం సానుకూల దిశగా మారుతుందని నమ్మకం ఉంది.
ఇంకా, వివాహం ఆలస్యం అవుతున్న వారు ప్రతిరోజూ బకెట్ నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయాలని సూచించబడుతుంది. ఈ విధానం ద్వారా త్వరగా వివాహం జరిగే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు.
బకెట్ నీటిలో ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి స్నానం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. పసుపులో ఉండే యాంటీబయోటిక్ లక్షణాలు వర్షాకాలంలో వ్యాపించే అంటువ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
Also Read: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే సమస్యలు తప్పవు!