Cristiano Ronaldo Engaged: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో, తన ప్రేయసి జార్జినా రోడ్రిగ్స్‌తో 8 ఏళ్ల డేటింగ్ అనంతరం ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకున్నాడు. 40 ఏళ్ల రొనాల్డో ఎంగేజ్‌మెంట్ వార్తను జార్జినా సోషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేస్తూ వెల్లడించింది. అయితే రొనాల్డో మాత్రం ఈ ఫోటోను ఎక్కడా షేర్ చేయలేదు.
![]() |
Portuguese Football Legend Cristiano Ronaldo Engaged With Spanish Model Georgina Rodríguez |
తన ప్రేయసి జార్జినాకు వజ్రపు ఉంగరంతో ప్రపోజ్ చేసిన రొనాల్డో, ఆమె వేలికి ఆ రింగ్ తొడిగాడు. జార్జినా తన వేలిపై మెరిసే వజ్రపు ఉంగరం ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. “అవును, ఈ రోజు వస్తుందని నాకు తెలుసు. సరైన సమయంలో పెళ్లి కూడా జరుగుతుంది” అని ఆమె పోస్ట్‌లో పేర్కొంది. గతంలోనూ రొనాల్డో తమ వివాహంపై పలుమార్లు స్పందిస్తూ, తాను 1000 శాతం జార్జినానే పెళ్లి చేసుకుంటానని స్పష్టంగా చెప్పాడు.
రూ. 26 కోట్ల విలువైన రింగ్: జార్జినా ధరించిన రింగ్ అత్యంత ఖరీదైనదిగా గుర్తించబడింది. వజ్రాలతో ముస్తాబైన ఈ రింగ్‌లో 35 క్యారెట్ల ఓవల్ షేప్ డైమండ్ ఉందని ప్రముఖ ఆభరణాల వ్యాపారి జూలియా షాఫ్ వెల్లడించారు. ఇలాంటి అరుదైన రింగులు సాధారణంగా వజ్రాల వేలంపాటలలో మాత్రమే లభిస్తాయని ఆమె తెలిపారు. ఈ రింగ్ విలువ సుమారు $3 మిలియన్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.26.30 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
క్రిస్టియానో - జార్జినా లవ్ స్టోరీ: తొమ్మిదేళ్ల క్రితం రొనాల్డో, మాడ్రిడ్‌లోని గూచీ స్టోర్‌లో జార్జినాను తొలిసారి కలిశాడు. ఆ సమయంలో ఆమె అక్కడ సేల్స్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లి కాకముందే ఈ జంట తల్లిదండ్రులయ్యారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. 2022 ఏప్రిల్‌లో జార్జినా కవలలకు జన్మనిచ్చింది. అయితే వారిలో ఒక శిశువును కోల్పోయారు. రొనాల్డో పెద్ద కుమారుడు జూనియర్ క్రిస్టియానో 2010లో జన్మించాడు, అయితే అతని తల్లి ఎవరో రొనాల్డో ఇప్పటివరకు వెల్లడించలేదు.
రొనాల్డో కెరీర్: ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో రొనాల్డో ఒకరు. అతనికి ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానులు ఉన్నారు. తన కెరీర్‌లో స్పోర్టింగ్ CP, మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, జువెంటస్ తరపున ఆడిన రొనాల్డో, ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్‌లో అల్ నాసర్ తరపున ఆడుతున్నాడు. పోర్చుగీస్ సెంటర్ ఫార్వర్డ్‌గా క్లబ్ స్థాయిలో 794 గోల్స్, 253 అసిస్ట్‌లు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో 138 గోల్స్, 45 అసిస్ట్‌లు నమోదు చేశాడు.
మరిన్ని Interesting Facts కొరకు మా ఛానల్ ను ఫాలో అవ్వండి V NEWS