India's Squad for Asia Cup 2025: టీ20 ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటింపు!

India's Squad for Asia Cup 2025: టీ20 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టును అధికారికంగా ప్రకటించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జాబితాను వెల్లడించగా, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

India Asia Cup 2025 Squad Announcement

భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఈ టోర్నమెంట్‌లో చోటు దక్కింది. అంతేకాకుండా, గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం విశేషం. కాగా, ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్‌కు మరోసారి సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు.

జట్టులో స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఎంపిక కాగా, ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌లను బరిలోకి దింపనున్నారు.

భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (కీపర్), హర్షిత్ సింగ్ రాణా.

India's Squad for Asia Cup 2025

జట్టు ఎంపికలో 3 ముఖ్య అంశాలు

1. గిల్‌కు వైస్ కెప్టెన్సీ: భారత టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. గతంలో అతని పేరు మీడియాలో ప్రస్తావించకపోయినా, ఐపీఎల్‌లో 650 పరుగులు చేసిన ప్రదర్శన అతని ఎంపికకు దోహదపడింది.

2. సిరాజ్, వాషింగ్టన్‌కు అవకాశం రాలేదు: అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్, హర్షిత్ రాణాలకు అవకాశం దక్కగా, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌కు జట్టులో స్థానం దక్కలేదు. యశస్వి జైస్వాల్, సుందర్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉంటారు.

3. బుమ్రా రీ-ఎంట్రీ: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ తర్వాత జట్టుకు దూరమైన జస్ప్రీత్ బుమ్రా మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్‌కు చేర్చిన శ్రేయాస్ అయ్యర్‌ను సెలెక్టర్లు పక్కన పెట్టారు.


భారత్-పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో

ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్ బి‌లో శ్రీలంక, బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి.

గ్రూప్ స్టేజ్‌లో భారత్ సెప్టెంబర్ 10న యుఎఇతో, 14న పాకిస్తాన్‌తో, 19న ఒమన్‌తో తలపడుతుంది. భారత్, పాకిస్తాన్ సూపర్-4 దశకు చేరితే, సెప్టెంబర్ 21న మరోసారి తలపడే అవకాశం ఉంది.

ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది. భారత్, పాకిస్తాన్ సూపర్-4లో అగ్రస్థానంలో ఉంటే, టోర్నమెంట్‌లో మూడోసారి కూడా రెండు జట్లు తలపడే అవకాశముంది.

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post