Arjun Tendulkar Engagement: సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి పీటలెక్కబోతున్నాడా?

Arjun Tendulkar Engagement: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలో వివాహబంధంలో అడుగుపెట్టనున్నాడని చెబుతున్నారు. ముంబయికి చెందిన సానియా చందోక్‌తో అర్జున్ నిశ్చితార్థం జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక పూర్తయిందని చెబుతున్నప్పటికీ, ఇరువురు కుటుంబాల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

Arjun Tendulkar Engagement

సానియా చందోక్ ఎవరు?

సానియా చందోక్ ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. రవి ఘాయ్ కుటుంబం ఆతిథ్య, ఆహార రంగాల్లో పలు విజయవంతమైన వ్యాపారాలు నిర్వహిస్తోంది. వీరివద్ద ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, ప్రసిద్ధ ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీ వంటి బిజినెస్‌లు ఉన్నాయి. వ్యక్తిగతంగా సానియా చాలా లో-ప్రొఫైల్‌గా జీవనశైలిని కొనసాగిస్తోంది. ఆమె మిస్టర్ పాస్ పెట్ స్పా & స్టోర్ భాగస్వామి, డైరెక్టర్‌గా పనిచేస్తోంది.

Also Read: వార్ 2 మూవీ రివ్యూ.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్ బ్లాస్ట్!

Saaniya Chandhok

క్రికెట్‌లో అర్జున్ ప్రయాణం

లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బ్యాటర్‌గా అర్జున్ భారత జట్టులో స్థానం సంపాదించుకునేందుకు కష్టపడుతున్నాడు. ప్రస్తుతం దేశీయ క్రికెట్‌లో గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతను, ఇప్పటివరకు 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీసి, 532 పరుగులు సాధించాడు. అదేవిధంగా, 24 టీ20 మ్యాచ్‌ల్లో 27 వికెట్లు, 119 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుతో అతని ప్రయాణం కొనసాగుతోంది.

Arjun Tendulkar
Arjun Tendulkar 

ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్జున్-సానియా నిశ్చితార్థం వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇరువురు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, అభిమానులు త్వరలోనే శుభవార్త వినిపిస్తుందనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Also Read: అతిలోక సుందరి శ్రీదేవి సృష్టించిన అరుదైన రికార్డు!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post