Raksha Bandhan: రక్షా బంధన్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Raksha Bandhan: హిందువులు జరుపుకునే పండగల్లో ఒకటి రాఖీ. ఈ పండగ సోదరులు, సోదరీమణుల మధ్య ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది. రాఖీ కట్టిన తన సోదరికి సోదరుడు తన జీవితాంతం కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుపై రక్షణ దారాన్ని కట్టి, స్వీట్లు అందించి, సోదరుడికి హారతినిస్తారు. రాఖీ కట్టించుకున్న సోదరుడు బహుమతి ఇస్తూ జీవితాంతం రక్షిస్తానని మాట ఇస్తాడు. ఈ పండుగ ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. 2025లో రాఖీ పండుగ ఆగష్టు 9న జరగనుంది.

రక్షాబంధన్ అర్థం మరియు పౌరాణికత: హిందూ మతంలోని పవిత్రమైన పండుగల్లో ఒకటి రక్షాబంధన్. ఇది సోదర సోదరీమణుల మధ్య పవిత్రమైన బంధానికి ప్రతీక. "రక్షాబంధన్" అనే పదం "రక్ష" + "బంధన్" అనే రెండు పదాల కలయిక. అంటే రక్షణ బంధం.. సోదరుడు తన సోదరిని ఎల్లప్పుడూ కాపాడతానని ఇచ్చే వాగ్దానం. ఈ పండుగకు అనేక పౌరాణిక కథలు, విశ్వాసాలు ఉన్నాయి. దేవతామూర్తుల కాలం నుంచే దీన్ని జరుపుకుంటున్నారని నమ్మకం.

సంతోషిమాత జననం: ఒక రోజు శ్రీ గణేశుడు తన సోదరి మానస దేవితో రక్షా సూత్రాన్ని కట్టించుకుంటున్నాడు. గణేశుని కుమారులు శుభ్, లాభ్ ఈ సంప్రదాయం గురించి అడిగారు. గణేశుడు ఇది సోదర సోదరీమణుల ప్రేమకు ప్రతీక అని చెప్పాడు. వారు తమకు కూడా ఒక సోదరి కావాలని కోరగా, గణేశుడు తన శక్తుల నుండి ఒక వెలుగును సృష్టించి, తన భార్యలు సిద్ధి, బుద్ధిల ఆత్మ శక్తులతో కలిపాడు. ఆ వెలుగు నుండి పుట్టిన అమ్మాయికి సంతోషి అని పేరు పెట్టారు. రక్షాబంధన్ సందర్భంగా ఆమె సోదరిగా ఆ ఇద్దరికీ వచ్చింది.

Also Read: వరలక్ష్మీ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా?

లక్ష్మీదేవి - బలి మహారాజు కథ: ఒకసారి అసురరాజు బలి మహావిష్ణువును పాతాళలోకానికి ఆహ్వానించాడు. విష్ణువు అంగీకరించగా, వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోయింది. తన భర్తను తిరిగి తీసుకురావడానికి, ఆమె బలి రాజు మణికట్టుకు రక్షా దారాన్ని కట్టింది. బలి, లక్ష్మీదేవి కోరిక అడగమని చెప్పగా, ఆమె మహావిష్ణువును తనకు అప్పగించమని కోరింది. ఆ విధంగా విష్ణువు తిరిగి వైకుంఠానికి చేరుకున్నాడు.

శ్రీకృష్ణుడు - ద్రౌపది అనుబంధం: మహాభారతంలో శిశుపాలుని వధించిన తర్వాత శ్రీకృష్ణుడి చూపుడు వేలికి గాయం అయింది. ద్రౌపది తన చీరలోంచి ఒక ముక్క చించి కట్టింది. ఆ అనురాగానికి ప్రభావితమైన శ్రీకృష్ణుడు, ఎప్పుడైనా తనను ఆశ్రయిస్తే రక్షిస్తానని వాగ్దానం చేశాడు.

మహారాణి కర్ణావతి - హుమాయున్ స్నేహబంధం: చిత్తోర్‌పై సుల్తాన్ బహదూర్ షా దాడి చేసినప్పుడు, రాణి కర్ణావతి హుమాయున్‌కు రాఖీ పంపి సహాయం కోరింది. హుమాయున్ సహాయం చేసేందుకు బయలుదేరినా, అతను చేరకముందే రాణి జౌహర్ చేసుకుంది.

యముడు - యమున కథ: పురాణం ప్రకారం, యముడు 12 సంవత్సరాలపాటు తన సోదరి యమునను చూడలేదు. యమున ఆవేదనను విని యముడు ఆమెను కలుసుకోవడానికి వచ్చాడు. యమున ఇచ్చిన ఆతిథ్యం చూసి సంతోషించిన యముడు, సోదరుడు-సోదరి రాఖీ కట్టుకునే సంప్రదాయం ప్రారంభమైంది.

Also Read: పితృస్వామ్యానికి విరుద్ధంగా జీవించే భారత తెగ గురించి మీకు తెలుసా?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post