Rainy Season Flowers: వర్షాకాలం వచ్చిందంటే చాలు… ప్రకృతిలో కొత్త జీవం నిండిపోతుంది. తేమ ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలు వేగంగా పెరుగుతాయి, పూలు త్వరగా పూస్తాయి. అందుకే ఈ సీజన్‌లో చాలా మంది తమ ఇంటి గార్డెన్‌ను రంగు రంగుల పూలతో నింపాలని అనుకుంటారు. ఇప్పుడు వర్షాకాలంలో ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చే ఐదు అందమైన పూల మొక్కలను తెలుసుకుందాం.
![]() |
Gulmehendi Flowers |
గుల్మెండి (గోరింట): ఇవి పసుపు, గులాబీ, ఎరుపు, నారింజ ఇలా ఎన్నో రంగుల్లో లభిస్తాయి. తక్కువ శ్రమతోనే వేగంగా పెరిగి, ఇంటి ఆవరణకు అందాన్ని తెస్తాయి.
![]() |
Chamanthi Flowers |
చామంతి పూలు: ఇవి ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి? తెలుపు, పసుపు, గులాబీ రంగుల్లో లభించే ఈ పూలు దీర్ఘకాలం నిలవడం, అందంగా కనిపించడం వల్ల వర్షాకాలపు గార్డెనింగ్‌లో తప్పనిసరి.
![]() |
Marigold Flowers |
బంతి పూలు: ఇవి పసుపు, నారింజ, ఎరుపు, తెలుపు వంటి పలు రంగుల్లో పూస్తాయి. పెంచడం చాలా ఈజీ, తక్కువ నీరు, తక్కువ ఎరువుతోనే మంచి పువ్వులు ఇస్తాయి.
![]() |
Zinnia Flower |
జిన్నీయా: వీటిని కొందరు ‘పట్నం బంతి’ అని కూడా పిలుస్తారు. ప్రకాశవంతమైన రంగులు, ఆకర్షణీయమైన ఆకారాలు వీటిని ప్రత్యేకం చేస్తాయి. వర్షాకాలంలో ఇవి చాలా వేగంగా పెరుగుతాయి.
![]() |
Hibiscus Flower |
మందారం: ఎరుపు, పసుపు, గులాబీ, తెలుపు వంటి ఎన్నో వేరియంట్లలో లభించే ఈ మొక్క ఎప్పుడూ పూలతో నిండుగా ఉంటుంది. వర్షాకాలంలో దీన్ని పెంచుకోవడం చాలా సులభం, ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది.
Also Read: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే సమస్యలు తప్పవు!