War 2 Movie Review: వార్ 2 మూవీ రివ్యూ.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్ బ్లాస్ట్!

War 2 Movie Review: తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న తర్వాత తొలిసారి బాలీవుడ్‌లో నటించిన చిత్రం వార్ 2. హృతిక్ రోషన్‌తో కలిసి నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్, యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కింది. ఎన్టీఆర్ ఈ ఫ్రాంఛైజీలో చేరడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా సినిమాపై ఆసక్తి పెరిగింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

War 2 Movie Review
War 2 Movie Review

కథ: 'RAW' మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) దేశానికి ద్రోహిగా ముద్రపడి అజ్ఞాతంలో ఉంటాడు. జపాన్‌లో ఒక శక్తివంతమైన వ్యక్తిని హతమార్చిన తర్వాత, కార్టెల్ అనే యాంటీ సోషల్ గ్రూప్ కబీర్ సహాయంతో భారత్‌ను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తుంది. ఈ క్రమంలో, కబీర్ తన గాడ్‌ఫాదర్ లాంటి సునీల్ లూథ్రా (అశుతోష్ రాణా)ని చంపేస్తాడు. దీనితో 'రా' కొత్త చీఫ్ విక్రాంత్ కౌల్ (అనిల్ కపూర్) నాయకత్వంలో, ఇండియన్ గవర్నమెంట్ సైనికుడు విక్రమ్ చలపతి (ఎన్టీఆర్)తో కూడిన టీమ్‌ను కబీర్‌ను పట్టుకోవడానికి రంగంలోకి దింపుతారు. ఈ మిషన్‌లో కావ్య లూథ్రా (కియారా అద్వాణి) కూడా ఉంటారు. కబీర్ అసలు దేశద్రోహి ఎందుకయ్యాడు? కార్టెల్ వెనుక ఎవరు ఉన్నారు? అనేది సినిమాల్లో తెలుస్తుంది.


విశ్లేషణ: సినిమా ఆరంభంలోనే ఇది ఇద్దరు హీరోల కథ అని దర్శకుడు స్పష్టత ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. హృతిక్-ఎన్టీఆర్‌ల మధ్య సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని రేకెత్తించినా, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ ట్రాక్ అంతగా ప్రభావం చూపదు. దేశభక్తి సన్నివేశాలు, కథా మలుపులు గత స్పై చిత్రాల మాదిరిగానే ఉండటం వలన కొత్తదనం తగ్గింది. కొన్ని ట్విస్టులు ప్రేక్షకుల్లో గందరగోళం కలిగించాయి.

నటీనటుల ప్రదర్శన: కబీర్ పాత్రలో హృతిక్ రోషన్ స్టైల్, యాక్షన్, డాన్స్ తో ఆకట్టుకున్నారు. విక్రమ్‌గా ఎన్టీఆర్ ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ హైలైట్ అయ్యాయి. కియారా అద్వాణి అందం, నటనతో ఆకర్షించారు. టెక్నికల్‌గా బెంజమిన్ జాస్పర్ కెమెరా వర్క్, యాక్షన్ సీన్స్ విజువల్స్ బలంగా నిలబెట్టాయి. సంచిత్, అంకిత్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది.

వార్ 2లో యాక్షన్ బ్లాస్ట్స్ ఉన్నప్పటికీ, కథలో కొత్తదనం లేకపోవడం మైనస్ అయ్యింది. మాస్ యాక్షన్ అభిమానులకు మాత్రం సరదాగా అనిపించే సినిమా.


మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS
Post a Comment (0)
Previous Post Next Post