Broad beans Health Benefits: చిక్కుడు కాయ మనకు మార్కెట్లో దొరికే రుచికరమైన కూరగాయల్లో ఒకటి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి పుష్కలమైన ప్రయోజనాలను అందించే సహజ ఆహార పదార్థం కూడా. ఇందులో ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిచ్చి, జీర్ణ సమస్యలు, డయేరియా వంటి సమస్యలను దూరం చేస్తాయి. మధుమేహాన్ని నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.
చిక్కుడు కాయల్లోని విటమిన్ B1, మెదడు పనితీరులో కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, వృద్ధాప్యంతో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులోని కాపర్, మెదడు ఆరోగ్యానికి అవసరమైన డోపమైన్, గ్యాలాక్టోజ్ వంటి రసాయనాల విడుదలకు తోడ్పడుతుంది.
Also Read: వర్షాకాలంలో తినకూడని కూరగాయలు ఇవే!
బరువు తగ్గాలనుకునే వారికి చిక్కుడు కాయలు సహజమైన ఔషధంలా పనిచేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు ఆకలిని తగ్గించి, శరీర బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత, ఎముకల బలహీనత సమస్యలకు చిక్కుడు మంచి పరిష్కారం. గర్భిణీ స్త్రీలకు అవసరమైన కాల్షియం, ఐరన్‌ను ఇవి సమృద్ధిగా అందిస్తాయి. అదనంగా, అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యాన్ని కాపాడుతూ, మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.
చిక్కుడు కాయల్లో థయామిన్, విటమిన్ K, విటమిన్ B6, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ C, విటమిన్ A, కోలిన్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, లీన్ ప్రోటీన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల రుచికరమైన వంటకాలకు రుచి ఇవ్వడమే కాదు, చిక్కుడు కాయలు మీ ఆరోగ్యాన్ని కాపాడే సహజ రక్షకుడిగా కూడా నిలుస్తాయి. సీజన్‌లో దొరికినప్పుడల్లా వీటిని ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
Also Read: పచ్చిమిరపకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.!
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS