Bike Servicing: బైక్ సర్వీసింగ్ టైమ్‌కు చేయకపోతే ఏమవుతుంది తెలుసా?

Bike Servicing: బైక్‌ను సురక్షితంగా, సమర్థంగా నడపాలంటే… కేవలం రైడింగ్‌ మీదే కాదు, సర్వీసింగ్‌ మీద కూడా సరైన అవగాహన ఉండాలి. మీరు బైక్‌ను ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోవడం వల్లే దాని పనితీరు, మైలేజ్, ఇంజిన్ లైఫ్ మెరుగ్గా ఉంటుంది. ఆలస్యంగా చేయడం వల్ల వచ్చే నష్టాలు చాలా తీవ్రమైనవే. బైక్‌ను ఎప్పుడు సర్వీస్ చేయాలి? ఆలస్యం చేస్తే ఎలాంటి ఖర్చులు ఎదురవుతాయి? అనే విషయాలు ఇప్పుడే తెలుసుకుందాం.

ఎప్పుడు బైక్ సర్వీస్ చేయాలి?

సాధారణంగా, ప్రతి 2000 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఒకసారి బైక్‌ను సర్వీస్ చేయడం ఉత్తమం. కొత్త బైక్‌ అయితే, తొలి సర్వీస్‌ను 500–750 కి.మీ. లోపల చేయించాలి. ఎలాగైనా 2500 కి.మీ. దాటేలోపు సర్వీస్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ తర్వాత ఆలస్యం చేస్తే బైక్‌లో కీలక భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

ఆలస్యం చేస్తే వచ్చే నష్టాలు

సకాలంలో సర్వీస్ చేయకపోతే క్లచ్ ప్లేట్, చైన్, పిస్టన్ లాంటి ముఖ్యమైన భాగాలు పాడయ్యే అవకాశముంటుంది. దాంతో:

  • పిస్టన్ డ్యామేజ్ అయితే - దాదాపు ₹3,000 ఖర్చవుతుంది
  • క్లచ్-పిస్టన్ రీపేర్ చేస్తే - ₹4,500 వరకు ఖర్చు
  • ఇంజిన్ డ్యామేజ్ అయితే - ₹6,000 నుంచి ₹7,000 వరకూ ఖర్చు రావచ్చు

ఇవి అంతా కేవలం నిర్లక్ష్యంగా సర్వీస్ చేయకపోవడం వల్లే జరుగుతాయి.

బైక్ సర్వీసింగ్‌లో ఏమేం చేస్తారు?

సర్వీసింగ్ సమయంలో సాధారణంగా ఈ పనులు చేస్తారు:

  • ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్ మార్పు
  • ఎయిర్ ఫిల్టర్ చెక్ చేసి అవసరమైతే రీప్లేస్
  • చైన్ క్లీనింగ్, లూబ్రికేషన్
  • ఎలక్ట్రికల్ సిస్టమ్, వైరింగ్ తనిఖీ
  • ఇంజిన్ శబ్దం ఎక్కువగా ఉంటే ట్యూనింగ్

ఈ ప్రతిఒక్క దశ కూడా బైక్ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ఖర్చులు తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎప్పుడు వెంటనే సర్వీస్ చేయాలి?

ఈ లక్షణాలు కనిపిస్తే సర్వీసింగ్ ఆలస్యం చేయకండి:

  • మైలేజ్ అనూహ్యంగా తగ్గిపోవడం
  • బైక్ స్టార్ట్ అవ్వడంలో ఇబ్బందులు
  • ఇంజిన్ శబ్దం ఎక్కువగా వినిపించడం
  • బైక్ నుంచి పొగ రావడం

ఇవన్నీ బైక్‌లో లోపాలను సూచించే సంకేతాలు కావచ్చు.

ఒక్కసారి ఆలస్యమైతే చిన్న సమస్య పెద్ద ఖర్చుగా మారుతుంది. అందుకే, బైక్‌కి టైమ్ టు టైమ్ సర్వీస్ చేయడం ద్వారా మీరు కేవలం దాని లైఫ్‌నే కాదు… మీ సేఫ్టీని కూడా కాపాడుకుంటారు. మీ బైక్ సర్వీస్ కావాల్సిన సమయం వచ్చిందా? లేదా? అని ఇవాళే చెక్ చేయండి 

Also Read: పాత కారు అమ్మే ముందు ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి.!

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post