Monsoon Diet Tips: వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఈ కాలంలో వాతావరణం తేమగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశముంటుంది. అందుకే ఆరోగ్య నిపుణులు కొన్ని కూరగాయలను ఈ సీజన్‌లో మానేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు మనం వర్షాకాలంలో తినకూడని ఐదు కూరగాయల గురించి తెలుసుకుందాం.
ఆకుకూరలు: ఇవి ఆరోగ్యానికి మంచివే కానీ వర్షాకాలంలో మాత్రం ప్రమాదకరంగా మారవచ్చు. ఎందుకంటే ఈ సీజన్‌లో వర్షాలు పడటం వల్ల ఆకుకూరలపై ఎక్కువగా దుమ్ము, మట్టితో పాటు బ్యాక్టీరియాలు కూడా చేరతాయి. వాటిని తినడం వలన ఫుడ్ పాయిజనింగ్, కడుపు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనీసం ఈ కాలంలో ఆకుకూరలను పూర్తిగా మానేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.
కాలీఫ్లవర్: కాలీఫ్లవర్ అంటే చాలా మందికి ఇష్టమైన కూరగాయ. కానీ వర్షాకాలంలో దీని గుబురు గుబురు భాగాల్లో పురుగులు, క్రిములు దాగి ఉండే అవకాశముంది. ఇవి శరీరానికి హానికరం కావటంతో, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అందువల్ల ఈ సీజన్‌లో కాలీఫ్లవర్ తీసుకోవడం మంచిదికాదంటారు ఆరోగ్య నిపుణులు.
క్యాబేజీ: ఇది కూడా భూమికి దగ్గరగా పెరిగే కూరగాయ. దీనిలో తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలంలో ఈ క్యాబేజీ తినడం వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. దాని ఫైబర్ కూడా కాస్త కఠినంగా ఉండటంతో, ఇది జీర్ణక్రియను అంతరాయం కలిగించే ప్రమాదం ఉంటుంది.
పుట్టగొడుగులు, క్యాప్సికమ్: పుట్టగొడుగులు తేమను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇవి వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు మూలంగా మారతాయి. అలాగే క్యాప్సికమ్ కూడా ఈ కాలంలో త్వరగా చెడిపోతుంది. వీటిని వాడే ముందు బాగా పరిశీలించకపోతే, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలకు దారితీయొచ్చు. కనుక ఈ కూరగాయలను వర్షాకాలంలో తప్పించుకోవడం మంచిది.
మరిన్ని Latest Health Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V Health