Generation Types Explained: పుట్టిన సంవత్సరాన్నిబట్టి మీ తరం తెలుసుకోండి.!

Generation Types Explained: మీరు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తారు? టెక్నాలజీతో మీరు ఎంత సమీపంగా ఉంటారు? పని పట్ల, జీవితం పట్ల మీ దృక్కోణం ఏంటి? ఇవన్నీ మీరు ఏ తరం వారికి చెందారనే విషయాన్ని సూచిస్తాయన్న సంగతి మీకు తెలుసా? 

జనరేషన్ అంటే ఏమిటి?

మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది కేవలం వ్యక్తిగత అనుభవాలు మాత్రమే కాదు… మనం జన్మించిన కాలం కూడా అదే రీతిలో ప్రభావం చూపుతుంది. ఇది మన జీవన శైలి, అభిప్రాయాలు, ఆలోచనా ధోరణి, కమ్యూనికేషన్ పద్ధతులపై స్పష్టమైన ముద్ర వేస్తుంది. అందుకే ‘తరం’ అనే పదం, ఒక సమాజంలోని నిర్దిష్ట కాలంలో జన్మించిన వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది. ప్రతి తరం వారికి ప్రత్యేకమైన సామాజిక, ఆర్థిక, సాంకేతిక పరిణామాల ద్వారా ప్రేరణ పొందుతుంది. వారి అభిరుచులు, ఆశయాలు, జీవితంపై దృక్కోణాలు కూడా అవే పునాది మీద తయారవుతాయి.

తరాల విభజన ఎలా జరిగింది?

ప్రపంచవ్యాప్తంగా తరాలను వివిధ కాల వ్యవధుల ప్రకారం విభజించారు. ఇప్పటి వరకు మొత్తం ఆరు తరాలు ప్రధానంగా గుర్తించబడ్డాయి: సాంప్రదాయవాదులు (1925–1945), బేబీ బూమర్స్ (1946–1964), జనరేషన్ ఎక్స్ (1965–1980), మిలీనియల్స్ (1981–1996), జెనరేషన్ Z (1997–2010), మరియు ఆల్ఫా (2011 తర్వాత). ఈ విభజన కేవలం పుట్టిన సంవత్సరాలపై ఆధారపడింది కాదు… ఆ తరంలో చోటు చేసుకున్న పెద్ద సామాజిక, సాంకేతిక మార్పులు, ఆర్థిక పరిణామాల ప్రభావాల ఆధారంగా జరిగింది.

ప్రతి తరం ప్రత్యేకత ఏంటి?

బూమర్స్ వ్యవధిలో జన్మించినవారు సంప్రదాయ విలువలకు పెద్ద పీట వేయడమే కాకుండా, వృత్తిపరంగా గట్టి నైపుణ్యాలతో ఎదిగారు. జనరేషన్ ఎక్స్ స్వతంత్రంగా ఆలోచించడాన్ని, జీవన సంతులనం (Work-Life Balance) పై దృష్టిని కలిగి ఉన్నారు. మిలీనియల్స్ అంటే టెక్నాలజీతో పెరిగినవారు. వీరు సామాజిక న్యాయం, వ్యక్తిగత అభివృద్ధిని అధికంగా విలువలుగా స్వీకరించారు. ఇక జెనరేషన్ Z, డిజిటల్ ప్రపంచంలోనే జన్మించి, అంతర్జాతీయ అంశాల పట్ల చురుకైన స్పందన కనబరుస్తారు. ఆల్ఫా తరం పిల్లలు ప్రస్తుతం పెరుగుతున్న తరమే, వీరి ప్రాధమిక రూపుదిద్దకంలో టెక్నాలజీ కీలకంగా మారింది.

తరం ఆధారంగా జీవన విధానం ఎలా ఉంటుంది?

తరం ఆధారంగా పని తీరూ, అభిప్రాయాలూ, కమ్యూనికేషన్ శైలీ వేరు వేరు. ఉదాహరణకు, బూమర్లు, జనరేషన్ ఎక్స్ నిర్మాణాత్మక విధానాలపై నమ్మకం ఉంచుతారు. వారు స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని కోరుకుంటారు. కానీ మిలీనియల్స్, జెన్ Z వారు టెక్నాలజీతో చేరిపడి, వేగవంతమైన మార్పులను ఆమోదించే స్వభావం కలిగి ఉంటారు. ఇది వారి ఉద్యోగ, కమ్యూనికేషన్, వినోదం, ఇంకా జీవిత నడతలో స్పష్టంగా కనిపిస్తుంది.

నేను ఏ తరానికి చెందినవారిని ఎలా గుర్తించాలి?

మీరు పుట్టిన సంవత్సరం, మీరు పెరిగిన సామాజిక వాతావరణం, టెక్నాలజీతో ఉన్న అనుబంధం ఆధారంగా మీరు ఏ తరం వారు అనేది అంచనా వేయవచ్చు. మీరు సామాజిక మార్పులపై స్పందించే తీరు, పని పద్ధతులు, వ్యక్తిగత అభిరుచులు కూడా మీ తరం గురించి స్పష్టతను ఇస్తాయి. ఇది కేవలం సరదాగా తెలుసుకోవడానికి మాత్రమే కాదు.. తరం ఆధారంగా ఇతరులతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

ప్రతి తరం ప్రత్యేకం… ప్రతిఒక్కరి దృక్కోణం విలక్షణం. మీరు ఏ తరం వారు అయినా, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి… ఈ తరాల పట్ల అవగాహన చాలా అవసరం. ఇప్పుడు మీరు ఏ తరం వారికి చెందినవారు అనేది తెల్సుకోవడమే కాదు… మిగతా తరాలవారిని అర్థం చేసుకోవడంలో ఇది మీకు మార్గదర్శకమవుతుంది.

Also Read: 30 సంవత్సరాల తర్వాత తిరిగి వికసించిన తామరపూల అసలు స్టోరీ తెలుసా?

మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS

Post a Comment (0)
Previous Post Next Post