Selling Old Car: పాత కారు అమ్మాలని అనుకుంటున్నారా? అయితే కేవలం మంచి ధరకే కాదు, క్లీన్ ట్రాన్సాక్షన్ కోసం కూడా కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవాలి. ఈ డాక్యుమెంట్లు ఉంటే, కొనుగోలు దారుడికి నమ్మకం కలుగుతుంది… మీకూ మంచి డీల్ దక్కుతుంది.
- ముందు, కారు సంబంధిత ప్రాథమిక డాక్యుమెంట్లు: రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ (PUC), ఇంకా కార్ ఇన్సురెన్స్. వీటి ద్వారా మీ వాహనం చట్టబద్ధంగా మీ పేరిట ఉందని, చట్టబద్ధంగా రోడ్డుపై నడుస్తున్నదని నిరూపించవచ్చు.
- తరువాత, మీ వ్యక్తిగత ఐడెంటిటీ డాక్యుమెంట్లు కావాలి. పాన్ కార్డ్ తప్పనిసరి. అలాగే చిరునామా రుజువు కోసం ఆధార్, ఓటర్ ఐడి, లేదా పాస్‌పోర్ట్ వంటివి అవసరం. కొన్ని రాష్ట్రాల్లో కరెంట్ బిల్లునూ అడ్రస్ ప్రూఫ్‌గా అంగీకరిస్తారు.
- ఆర్‌టీఓ (RTO) డాక్యుమెంట్లు: ఫారం 28 - ఎన్‌ఓసీ కోసం, ఫారం 29 - కారును అమ్మినట్లు తెలిపేందుకు, ఫారం 30 - ఓనర్‌షిప్ ట్రాన్స్ఫర్ ప్రారంభించేందుకు. ఇవి సమర్పించకపోతే లీగల్ ఇష్యూలు రావచ్చు.
- అంతేకాదు, కారుతో పాటు కొన్ని ఎక్స్‌ట్రా డాక్యుమెంట్లు ఉంటే మరింత ట్రస్ట్ పెరుగుతుంది. వాహనం ఒరిజినల్ బిల్లు, ఓనర్ మాన్యువల్, ఇంకా సర్వీస్ హిస్టరీ ఉంటే కొత్త ఓనర్‌కు ఇది added advantage. ఇంక మీరు మంచి రేటుకు కారును అమ్మే అవకాశం పెంచుతుంది.
Also Read: కొత్త బైక్ కొనేవారికి బంపర్ ఆఫర్