Home made Rose Water: చర్మకాంతి కోసం నేటి రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా రోజ్ వాటర్‌ను విస్తృతంగా వాడుతున్నారు. చర్మాన్ని కాంతివంతంగా ఉంచే గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు ఉపయోగిస్తున్న రోజ్ వాటర్ నిజమైనదా లేక కల్తీదా అనేది గుర్తించడం కష్టసాధ్యం. అందుకే ఇంట్లోనే సహజసిద్ధంగా రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఉత్తమం. ఇక అది ఎలా తయారు చేయాలో చూద్దాం.
![]() |
Home made Rose Water |
మూడు గులాబీ పువ్వులు తీసుకుని, వాటి రెక్కలను వేరు చేయాలి. ఆ రెక్కలను 5 నిమిషాలపాటు నీటిలో నానబెట్టాలి. తరువాత మళ్లీ స్వచ్ఛమైన నీటితో రెక్కలను శుభ్రం చేయాలి. ఇప్పుడు ఒక పాత్రలో గులాబీ రెక్కలు వేసి, అవి మునిగేంత వరకు నీరు పోసి, తక్కువ మంటపై గ్యాస్ స్టౌవ్ మీద ఉంచాలి. నీరు గులాబీ రంగులోకి మారే వరకు వేడి చేయాలి. రంగు మారిన తరువాత నీటిని చల్లార్చి, వడగట్టి, ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
మార్కెట్‌లో లభించే కల్తీ ఉత్పత్తులపై ఆధారపడకుండా, ఇంట్లోనే స్వచ్ఛమైన రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది, చర్మానికి సహజసిద్ధమైన కాంతిని అందిస్తుంది.
Also Read: రోజూ పసుపుతో స్నానం చేస్తే కలిగే అద్భుత ప్రయోజనాలు… తెలుసా?
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS