AP Free Android Phones Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. మూగ, చెవిటితనంతో బాధపడుతున్న బధిరులకు ఉచిత ఆండ్రాయిడ్ ఫోన్లు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పూర్తయి, ఇంటర్మీడియేట్ పాస్ అయిన వారు ఈ పథకానికి అర్హులు.
![]() |
AP CM Chandrababu Naidu |
40% వైకల్యం కలిగి, సైగల భాష (Sign Language) తెలిసినవారికి మాత్రమే అర్హత కల్పిస్తామని విభాగం స్పష్టం చేసింది. అదనంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి. అర్హులైన వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆసక్తి గలవారు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయవచ్చు.
పరికరాల కోసం పరీక్షలు
విభిన్న ప్రతిభావంతుల శాఖ ఇప్పటికే దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు (Welfare Schemes) అమలు చేస్తూ, రాయితీలు అందిస్తోంది. మూడు చక్రాల మోటార్ వాహనాలు, వీల్‌చైర్లు వంటి పరికరాలు అందజేస్తోంది. తాజాగా ఉచిత సెల్‌ఫోన్లు అందించడానికి నిర్ణయించింది.
ఈ ఏడాదిలోనే అవసరమైన పరికరాలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకోసం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. 18 ఏళ్ల లోపు ఉన్నవారికి కూడా పరీక్షలు చేసి, అర్హులైన వారికి సమగ్ర శిక్ష ద్వారా పరికరాలు అందిస్తారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 26నాటికి పరీక్షలు పూర్తవుతాయి. అనంతరం మూడు చక్రాల వాహనాలు, వీల్‌చైర్లు, చంకకర్రలు, వినికిడి యంత్రాలు, అలాగే చూపు సమస్యలతో బాధపడేవారికి ప్రత్యేక TLM కిట్లు పంపిణీ చేస్తారు.
40% వైకల్యం తప్పనిసరి
ఉచిత సెల్‌ఫోన్ల కోసం దరఖాస్తు చేయాలంటే 40% పైగా వైకల్యం ఉండాలి. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డ్, పదో తరగతి మరియు ఇంటర్ మార్కుల జాబితా, సదరన్ ధ్రువీకరణ పత్రం, సైగల భాష ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ (SC, ST, BC), పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, తెల్ల రేషన్ కార్డు ప్రతులు సమర్పించాలి.
ఈ పథకం ద్వారా ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకి ప్రోత్సాహం అందించి, ఉన్నత విద్య కొనసాగించేందుకు అవసరమైన సదుపాయాన్ని కల్పించడం ప్రభుత్వ లక్ష్యం.
మరిన్ని Latest Updates కోసం ఇప్పుడే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి V NEWS