Increasing Egg Prices: కూరగాయల ధరల్లో తగ్గుదల కనిపించడం లేదు. మోంథా తుపాను ప్రభావాన్ని కారణంగా చూపుతూ రైతులు ధరలను పెంచుతుండగా, దళారులు కూడా తమకిష్టమొచ్చినట్లుగా రేట్లు పెంచి దందా సాగిస్తున్నారు. కార్తీక మాసం మొదలుకాకముందు కిలోకు రూ.20కి అమ్మిన కూరగాయలు ఇప్పుడు రూ.100 వరకు వెళ్లిపోయాయి. ఈ పరిస్థితి సాధారణ, మధ్యతరగతి కుటుంబాలపై గట్టి భారం వేసింది. రోజువారీ ఖర్చులు భారీగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
![]() |
| Increasing Egg Prices |
కొండెక్కిన కోడిగుడ్డు ధరలు
కూరగాయల ధరలు పెరగడమే కాకుండా కోడిగుడ్ల రేట్లు కూడా ఒక్కసారిగా ఎగబాకాయి. కిలో వంద రూపాయలకు చేరిన కూరగాయలతో పాటు గుడ్లు కూడా రూ.7 వరకు పెరగడం వినియోగదారులను ఆశ్చర్యంలో ముంచింది. కార్తీక మాసంలో ఉపవాసాలు, అయ్యప్ప దీక్షలు జరుగుతుండడం వల్ల గుడ్ల వినియోగం సాధారణంగా తగ్గాలి. కానీ ఈసారి పరిస్థితి విరుద్ధంగా ఉండటంతో ధరలు తగ్గకుండా మరింత పెరిగాయి. గత నెలలో రూ.5–6 ఉన్న ఒక్క గుడ్డు ఇప్పుడు రూ.7 నుంచి రూ.8 మధ్యలో అమ్ముతున్నారు. డజను గుడ్లు రూ.98కు చేరడంతో కుటుంబాలు కొనడాన్ని కూడా ఆలోచించాల్సి వస్తోంది.

సరఫరా తగ్గడం ప్రధాన కారణమని వ్యాపారుల వివరణ
గుడ్ల ధరలు పెరగడానికి సరఫరా తగ్గిపోవడమే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అక్టోబర్‌లో కిలో చికెన్ ధరలు రూ.240-260 ఉండగా, ప్రస్తుతం రూ.20-40 వరకు పడిపోయాయి. అయితే చికెన్ ధరలు తగ్గినా గుడ్ల రేట్లు పెరగడం వినియోగదారులకు ఆశ్చర్యంగా మారింది. ఇదే తరహాలో తెలంగాణలో కూడా గుడ్లు, కూరగాయల ధరలు పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతిరోజు కొత్త రేట్లు చూసే పరిస్థితి ఏర్పడడంతో వినియోగదారులు ఏం కొనాలి, ఎలా కొనాలి అన్న ఆలోచనలో పడిపోయారు.