PM Modi Ayodhya Temple Flag Hoisting: అయోధ్యలో మరో చారిత్రాత్మక ఆధ్యాత్మిక ఘట్టం!

PM Modi Ayodhya Temple Flag Hoisting: అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అనంతరం, అక్కడ మళ్లీ ఒక పవిత్రమైన, చారిత్రాత్మక ఘట్టం ప్రారంభమైంది. మంగళవారం జరిగిన అయోధ్య రామమందిర ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత ఘనంగా, ఆధ్యాత్మిక వైభవంతో సాగింది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, RSS ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ హాజరయ్యారు. రామాలయం సముదాయంలోని పలు దేవాలయాలను వారు దర్శించిన అనంతరం, తొలి అంతస్తులోని రామదర్బార్‌లో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహం సమక్షంలో యథావిధిగా పూజలు చేశారు.

PM Modi Ayodhya Temple Flag Hoisting
PM Modi Ayodhya Temple Flag Hoisting

రామ మందిరంపై కాషాయ జెండా ఎగురవేత
అనంతరం, అయోధ్యానగరిలో చరిత్రత్మాక ఘట్టంగా నిలిచిపోయే విధంగా రామ మందిరంపై జాతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన కాషాయ జెండా ప్రధాని మోదీ ఎగరవేశారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్న సందర్భంలో నిర్వహించిన ఈ ధ్వజారోహణ కార్యక్రమం ఒక ప్రతీకాత్మక ఘట్టంగా నమోదు అయింది. ఉదయం 11:58 గంటలకు ప్రధాని రామ మందిర గోపురంపై కాషాయ జెండాను ఎగురవేయగా, అక్కడి వాతావరణం భక్తి, ఆనందంతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమం ఆలయ నిర్మాణ పూర్తి స్థాయికి చేరుకున్న సందర్భంగా నిర్వహించబడిన చివరి దశ ఆధ్యాత్మిక కార్యక్రమంగా నిలిచింది.

సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా ఈ వేడుక
ఈ చారిత్రాత్మక వేడుక సాంస్కృతిక పునరుజ్జీవనానికి, జాతీయ ఐక్యతకు ఒక కొత్త అధ్యాయం రాసినట్టుగా భావిస్తున్నారు. రామ మందిర నిర్మాణం ముగింపు దశకు చేరుకోవడంతో, ఈ ధ్వజారోహణ కార్యక్రమం దేశవ్యాప్తంగా కోట్లాది భక్తుల్లో మళ్లీ ఆధ్యాత్మికతపై నమ్మకాన్ని, భక్తి పూర్ణ వాతావరణాన్ని కలిగించింది. ఈ ఘట్టంతో అయోధ్య రామాలయ నిర్మాణం అధికారికంగా సమాప్తి దశలోకి అడుగుపెట్టింది.

Also Read: లక్ష్మీ నివాస్ మిట్టల్ బ్రిటన్‌కు గుడ్‌బై… వారసత్వ పన్ను మార్పులతో స్విట్జర్లాండ్‌కు షిఫ్ట్!

#WATCH | Ayodhya Dhwajarohan | PM Modi and RSS Sarsanghchalak Mohan Bhagwat ceremonially hoist the saffron flag on the Shikhar of the sacred Shri Ram Janmbhoomi Temple, symbolising the completion of the temple’s construction.
Post a Comment (0)
Previous Post Next Post